ఢిల్లీ క్యాపిటల్స్ లోకి రోహిత్ శర్మ.. నిజమేనా?
ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం పై అందరూ షాక్ లో మునిగి పోయారు. రోహిత్ ఫ్యాన్స్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. సూపర్ సక్సెస్ అయిన కెప్టెన్ ని సారధ్య బాధ్యతల నుంచి తొలగించడం ఏంటి అని అందరూ సోషల్ మీడియా వేదికగా ముంబై ఇండియన్స్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే కొంత మంది ముంబై ఇండియన్స్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతుంటే.. ఇంకొంత మంది ఇక కెప్టెన్సీ కోల్పోయిన రోహిత్ మరో టీం లోకి వచ్చి సారధ్య బాధ్యతలు అందుకోవాలని సూచిస్తున్నారు.
ఈ క్రమం లోనే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పోగొట్టుకున్న రోహిత్ శర్మ కోసం మరో ఫ్రాంచైజీ సంప్రదించిందట. ఆ ఫ్రాంచైజీ ఏదో కాదు ఢిల్లీ క్యాపిటల్స్. రోహిత్ ట్రేడింగ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ముంబై మేనేజ్మెంట్ సున్నితం గా తిరస్కరించినట్లు సమాచారం. అయితే కాంట్రాక్ట్ డీల్ ఉన్నందున రోహిత్ ను వదులు కోలేమని ముంబై ఫ్రాంచైజీ ఢిల్లీకి తెలిపిందట ఇక ఈ సంప్రదింపుల వెనుక ఢిల్లీకి మెంటర్ గా వ్యవహరిస్తున్న సౌరబ్ గంగూలీ ఉన్నాడు అన్నది తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.