చెన్నై జట్టులోకి రోహిత్.. రితిక కామెంట్ వైరల్?
అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్ గా కొనసాగుతున్న అతడిని.. ఇక సారధిగా కొనసాగించాల్సింది పోయి.. చివరికి పక్కన పెట్టేసింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చేతికి కెప్టెన్సీ అప్పగించింది అని చెప్పాలి. అయితే ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు. కాగా ఇప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పోగొట్టుకున్న రోహిత్.. మరో టీం లోకి వెళ్ళబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని జట్టులో తీసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి అని చెప్పాలి.
ఇలాంటి సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ పెట్టిన పోస్ట్ కి రోహిత్ భార్య లైక్ కొట్టడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. రోహిత్ శర్మ దశాబ్ద కాలంగా కెప్టెన్ గా అందరిలో స్ఫూర్తిని నింపాడు అంటూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టగా.. ఆ పోస్ట్ కి రోహిత్ భార్య ఎల్లో లవ్ సింబల్ ఎమోజితో రిప్లై ఇచ్చారు. అయితే ఈ కామెంట్ వైరల్ గా మారిపోయింది. రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడతారు అంటూ వస్తున్న వార్తలకు ఇక ఈ రిప్లే ఊతం ఇచ్చినట్లు అయింది అని చెప్పాలి. అయితే రోహిత్ నిజంగానే చెన్నై సూపర్ కింగ్స్ లోకి వస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు అని క్రికెట్ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు.