2024 ఐపిఎల్ లో.. బంగ్లా క్రికెటర్లు ఆడేది అనుమానమేనట?
అదే సమయంలో తమ దగ్గర ఉన్న పర్స్ మనీతో అటు డిసెంబర్ 19వ తేదీన జరగబోయే ఐపీఎల్ వేలంలో ఇంకొంతమంది ఆటగాళ్ళను జట్టులోకి తీసుకునేందుకు అన్ని టీమ్స్ కూడా సిద్ధమయ్యాయి అని చెప్పాలి. అయితే బిసిసిఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోప్రపంచ క్రికెట్లో ఉన్న అన్ని దేశాల జట్ల నుంచి కూడా ఆటగాళ్లు పాల్గొంటూ ఉంటారు. అయితే ఇక బంగ్లాదేశ్ క్రికెటర్లు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్లో బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఆడటం కష్టమే అనేది తెలుస్తుంది.
ఎందుకంటే ఐపీఎల్ లో బంగ్లాదేశ్ ప్లేయర్లు పాల్గొనడం పై సందిగ్ధత నెలకొంది అని చెప్పాలి. తమ ఆటగాళ్లను లీగ్ మొత్తానికి పంపించాలా వద్దా అనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. అయితే బంగ్లా ప్లేయర్స్ తస్కిన్, ముస్తాఫిసుర్ రెహమాన్, శారీఫుల్ ఇస్లాం ఈసారి ఐపీఎల్ వేలంలో పాల్గొనాల్సి ఉంది. ముస్తాఫిస్ రెహమాన్ రెండు కోట్లకు తస్కిన్ అహ్మదును 75 లక్షలు షోరిపూర్ ఇస్లాం 50 లక్షలతో వేలంలో పాల్గొనబోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ క్రికెటర్లను తమ టీం లోకి తీసుకునేందుకు కొన్ని ఫ్రాంచైజీలు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయ్. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ట్విస్ట్ ఇవ్వడంతో ఈ క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు వచ్చే ఛాన్స్ లేదు అన్నది తెలుస్తుంది.