రోహిత్ అభిమానులకు.. నిజంగా ఇది హార్ట్ బ్రేకింగ్ మూమెంట్?

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో లెజెండరీ కెప్టెన్ ఎవరు అంటే రోహిత్ శర్మతోపాటు మహేంద్రసింగ్ ధోనీ పేరు చెబుతూ ఉంటారు చాలామంది క్రికెట్ ఫ్యాన్స్. ఎందుకంటే ఈ ఇద్దరు కెప్టెన్లు మాత్రమే తాము సారథ్యం వహిస్తున్న జట్లకు ఐదుసార్లు టైటిల్ అందించగలిగారు. మిగతా ఏ కెప్టెన్లు కూడా వీరికి చేరువలో కూడా లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ తర్వాత అటు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న రోహిత్ శర్మ జట్టును ఎంత విజయవంతంగా ముందుకు నడిపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ముంబై ఇండియన్స్ ని అతి తక్కువ సమయంలోనే ఐదు సార్లు ఛాంపియన్గా నిలపడంలో సక్సెస్ అయ్యాడు రోహిత్ శర్మ. ఇక రోహిత్ అనే ఒక ప్లేయర్ లేకపోతే ఇక ముంబై ఇండియన్స్ అంత సక్సెస్ కాలేదు అని  ఆ టీం అభిమానులు అందరూ కూడా చెబుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఏకంగా రోహిత్ శర్మ అభిమానుల హార్ట్ బ్రేక్ అయింది.


 ఎందుకంటే ఇన్నాళ్లు రోహిత్ అంటే ముంబై ఇండియన్స్.. ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ అనుకున్న అభిమానులు అందరూ కూడా ఇకనుంచి అలా అనుకునే పరిస్థితి లేకుండా పోయింది  ఎందుకంటే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తొలగించి అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్ గా నియమించింది జట్టు యాజమాన్యం. దీంతో రోహిత్ ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. ముంబై ఇండియన్స్ కి ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను కాదనడం సరికాదు అంటూ మండి పడుతున్నారు అభిమానులు. రోహిత్ ఐపీఎల్ నుంచి తప్పుకునే వరకు అతన్నే కెప్టెన్ గా కొనసాగించి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: