ఐపీఎల్ వేలంపై.. క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్?

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరల్డ్ క్రికెట్లో ఎంత ప్రత్యేకమైన స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సాదాసీదా క్రికెట్ లీగ్ గా ప్రారంభమైన ఐపీఎల్ ఏకంగా వరల్డ్ క్రికెట్ పైన ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపించింది. అంతేకాదు ఇక ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కూడా కొనసాగుతుంది ఐపీఎల్. ఇక ప్రతి ఏడాది కూడా క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటుంది అని చెప్పాలి.


ఇకపోతే 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇప్పటికే అన్ని టీమ్స్ కూడా తమతో అంటిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను.. వేలంలోకి వదిలేసే ప్లేయర్స్ డీటెయిల్స్ ని కూడా ప్రకటించాయి. ఇక డిసెంబర్ 19వ తేదీన మినీ వేలం ప్రక్రియ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వేలంలో ఎవరు ఎక్కువ ధర పలుకుతారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇక డిసెంబర్ 19వ తేదీన దుబాయ్ వేదికగా జరగబోయే వేలంని ప్రత్యక్ష ప్రసారం చూడాలని ప్రేక్షకులు కూడా ఆశపడుతూ ఉన్నారు.


 ఇలాంటి సమయంలోనే ఐపిఎల్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది జియో కంపెనీ. డిసెంబర్ 19వ తేదీన జరిగే వేలం ప్రక్రియను జియో సినిమా యాప్ లో ఉచితంగా స్ట్రీమింగ్  చేస్తాము అంటూ ప్రకటన చేసింది. డిసెంబర్ 19వ తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి ఆక్షన్ మొదలవుతుంది. దుబాయిలో జరిగే వేలంలో మొత్తం 33 మంది క్రికెటర్లు పాల్గొనబోతున్నారు అని చెప్పాలి. ఇక ఇందులో 214 మంది భారత ప్లేయర్లు ఉంటే.. 119 మంది విదేశీ ప్లేయర్లు ఉండడం గమనార్హం. దీంతో ఇక ఈ మినీ ఆక్షన్ ను చూసేందుకు క్రికెట్ ఫాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: