ఐసీసీ ర్యాంకింగ్స్ లో.. మనోళ్లదే మొత్తం హవా?

praveen
భారత జట్టు అటు ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అటు బీసీసీఐ ఏకంగా వరల్డ్ క్రికెట్ ను శాసిస్తున్న క్రికెట్ బోర్డుగా కూడా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే దనిక క్రికెట్ బోర్డుగా ఉంది బిసిసిఐ. ఇక భారత్లో క్రికెట్కు ఉన్న క్రేజే బీసీసీఐ ఇలా ధనిక క్రికెట్ బోర్డుగా మారడానికి కారణం అని చెప్పాలి. అయితే ఇలా వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా ఉన్న భారత జట్టు.. ఆట విషయంలో కూడా అదే రీతిలో హవా నడిపిస్తుంది అని చెప్పాలి.

 మరి ముఖ్యంగా కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మ తీసుకున్న తర్వాత.. భారత జట్టు మరింత దూకుడుగా ప్రత్యర్ధులపై ఆదిపత్యాన్ని చెలాయిస్తోంది. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ వరుస విజయాల సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించే ర్యాంకింగ్స్ లో కూడా అటు భారత జట్టు సత్తా చాటుతుంది అని చెప్పాలి. ఏకంగా మూడు ఫార్మాట్లలో కూడా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న జట్టుగా ఉంది భారత్.

 అయితే కేవలం టీమిండియా మూడు ఫార్మట్లలో నెంబర్ వన్ గా కొనసాగడమే కాదు జట్టులోని ఆటగాళ్ళు సైతం ఇలాగే ఐసిసి ర్యాంకింగ్స్ లో హవా నడిపిస్తున్నారు. t20 ఫార్మాట్లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా 865 పాయింట్లతో సూర్యకుమార్ ఉండగా ఇక 692 పాయింట్లు బౌలర్ రవి బిష్ణయ్ నెంబర్ వన్ గా ఉన్నాడు. వన్డే లలో బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లలో 826 పాయింట్లు గిల్ టాప్ లో ఉండగా.. టెస్టుల్లో టాప్ బౌలర్గా అశ్విన్ ఆల్రౌండర్ లో టాప్ లో జడేజా ఉన్నారు. ఇలా ఐసీసీ ర్యాంకింగ్స్ లో  అటు భారత జట్టుకు మాత్రమే కాదు భారత ప్లేయర్లది కూడా హవా నడుస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: