సూర్య కుమార్ కు అవమానం.. ప్రెస్ మీట్ కు రిపోర్టర్లే రాలేదే?
అయితే ఇండియాలో క్రికెట్కు ఈ రేంజ్ లో క్రేజ్ ఉంది కాబట్టే బీసీసీఐకి అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో పోల్చి చూస్తే భారీగా ఆదాయం వస్తూ ఉంటుంది. ఇలా వచ్చిన ఆదాయమే ఏకంగా బీసీసీఐ అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో పోల్చి చూస్తే ధనిక క్రికెట్ బోర్డుగా నిలిపింది అని చెప్పాలి. అయితే అందుకే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మాత్రమే కాదు మ్యాచ్కి ముందు క్రికెటర్ లు నిర్వహించే ప్రెస్ మీట్ సమయంలో కూడా ఇక అన్ని మీడియా ఛానల్స్ అన్నీ కూడా పరుగులు పెట్టుకుంటూ వస్తాయి. ఈ క్రమంలోనే తాము అడగాల్సిన ప్రశ్నలన్నిటిని కూడా అడుగుతూ ఉంటాయి అని చెప్పాలి.
అలాంటిది ఇటీవలే మ్యాచ్ ను ముందు నిర్వహించిన ప్రెస్ మీట్ కి మాత్రం అసలు రిపోర్టర్లు ఎవరు రాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆస్ట్రేలియాతో జరగబోయే టి20 సిరీస్ నేటి నుంచి ప్రారంభం కాబోతుండగా.. తాత్కాలిక కెప్టెన్ గా ప్రకటించిన సూర్య కుమార్ యాదవ్ ఇటీవల ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. అయితే ఎప్పుడు లెక్కకు మించి వచ్చే రిపోర్టర్లు కేవలం ఇద్దరే ఇద్దరు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇండియా వరల్డ్ కప్ ఓడిపోవడంతోనే ఇలా జరిగిందని కొంతమంది అంటుంటే.. కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ నిర్ణయాలు నచ్చకపోవడమే ఇందుకు కారణమని ఇంకొంతమంది అంటున్నారు.