వరల్డ్ కప్ లో.. బెస్ట్ ఫీల్డింగ్ టీం ఏదో ప్రకటించిన ఐసీసీ?

praveen
ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ లో అటు ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్గా నిలిచింది అన్న విషయం తెలిసిందే. ఫైనల్ పోరులో టీమ్ ఇండియాని ఓడించి విశ్వ విజేతగా అవతరించింది. ఇక ఆరోసారి వరల్డ్ కప్ టైటిల్ ముద్దాడింది ఆస్ట్రేలియా అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సొంత గడ్డమీద భారత జట్టు టైటిల్ గెలవలేకపోయింది అనే బాధ చాలామంది క్రికెట్ ప్రేక్షకులలో ఉన్నప్పటికీ ఇక టైటిల్ గెలవడానికి ఆస్ట్రేలియా జట్టు అన్ని విధాలఅర్హత ఉన్న టీం అంటూ ఎంతమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 ఎందుకంటే వరల్డ్ కప్ లో ఓటమితోనే ప్రస్తానాన్ని మొదలుపెట్టింది ఆస్ట్రేలియా. వరుసగా ఓటములతో అందరిని నిరాశపరిచింది. దీంతో ఆస్ట్రేలియా కనీసం సెమి ఫైనల్లో కూడా అడుగుపెట్టడం కష్టమే అని అనుకున్నారు. కానీ అలాంటి సమయంలో వరుస విజయాలు సాధిస్తూ సెమీఫైనల్ రేస్ లో నిలిచింది. పాయింట్లు పట్టికలో మూడో స్థానంలో కొనసాగి సెమీఫైనల్ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్ వరకు చేరుకుంది. ఫైనల్ లో టీమిండియా పై విజయం సాధించింది.


 బ్యాటింగ్ బౌలింగ్ విభాగం లో మాత్రమే కాదు ఫీల్డింగ్ లో కూడా అత్యుత్తమం గా రాణించింది ఆస్ట్రేలియా.. అయితే ఇటీవల వరల్డ్ కప్ 2023లో బెస్ట్ ఫీల్డింగ్  టీం ఏది అన్న విషయాన్ని ఐసిసి ప్రకటించింది. ఆ టీం ఏదో కాదు ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియానే. 383.58 ఫీల్డింగ్  ఇంపాక్ట్ రేటింగ్ పాయింట్ల తో ఆస్ట్రేలియా బెస్ట్ ఫీలింగ్ టీంలో తొలి స్థానం లో నిలిచింది. తర్వాత 340.59 సౌత్ ఆఫ్రికా, 292.02  పాయింట్లతో నెదర్లాండ్స్,  281.04 పాయింట్లతో ఇండియా, 255.43 ఇంపాక్ట్ పాయింట్లతో ఇంగ్లాండ్, 225.53 పాయింట్లతో న్యూజిలాండ్  జట్లు బెస్ట్ ఫీల్డింగ్ టీమ్స్ గా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: