టీమిండియా ఓటమికి.. ఓవర్ కాన్ఫిడెన్సే కారణం : పాక్ మాజీ

praveen
ఎంతో ప్రతిష్టాత్మకంగా భారత్ వేదికగా ప్రారంభమైన వన్డే వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా టైటిల్ విజేతగా నిలుస్తుంది అని క్రికెట్ ప్రపంచం మొత్తం ఊహించినప్పటికీ అందరి అంచనాలు తారుమారు అయ్యాయి అన్న విషయం తెలిసిందే. లీగ్ దశ నుంచి కూడా ఒక్క ఓటమి కూడా లేకుండా వరుస విజయాలతో దూసుకు వచ్చిన భారత జట్టు.. అటు వరల్డ్ కప్ లో మాత్రం విజేతగా నిలవలేకపోయింది. ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓడిపోయి టైటిల్ చేజార్చుకుంది  అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా టైటిల్ పోరులో ఫైనల్ లో టీమిండియా ఓడిపోవడంతో 140 కోట్ల మంది భారతీయులు మాత్రమే కాదు క్రికెట్ ప్రపంచం మొత్తం నిరాశలో మునిగిపోయింది. ఎందుకంటే ఒక్క ఓటమి లేకుండా దూసుకు వచ్చిన టీమిండియా.. వరల్డ్ కప్ గెలిచి ఉంటే బాగుండేది అని ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు కూడా కోరుకున్నారు. కానీ అలా జరగకపోవడంతో భారత క్రికెట్ ప్రేక్షకులతో పాటు మరికొంతమంది క్రికెట్ ఫాన్స్ కూడా నిరాశలో ఉన్నారు. కానీ ఇక భారత ఓటమితో అటు పాకిస్తాన్ మాజీలు మాత్రం ఆనందంలో ఉన్నారు. భారత విజయాలను చూసి ఓర్వలేక సంచలన వ్యాఖ్యలు చేసిన వారు.. టీమిండియా ఓటమి నేపథ్యంలో ఇక భారత జట్టుపై విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 అయితే ఇక ఇటీవల భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది తన అసహనాన్ని ప్రదర్శించాడు. వరుసగా మ్యాచ్ లు గెలిస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది  అదే మీ పతనానికి దారితీస్తుంది అంటూ ఇక భారత జట్టు ఓటమిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ పాకిస్తాన్ మాజీ క్రికెటర్. ఈ క్రమంలోనే షాహిద్ ఆఫ్రిది చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇకపోతే అటు పాకిస్తాన్ జట్టు కనీసం సెమి ఫైనల్లో కూడా అడుగుపెట్టకుండా టోర్ని నుంచి నిష్క్రమించడంతో.. ఆ దేశ మాజీలు ఇక టీమిండియా గెలుపును చూసి ఓర్వలేక అక్కస్సుతో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: