వరల్డ్ కప్ ట్రోఫీని.. ఘోరంగా అవమానించిన ఆస్ట్రేలియా?
ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేసి టైటిల్ గెలుస్తుంది అనుకున్న భారత జట్టు.. చివరికి ఒత్తిడి ముందు చిత్తయ్ ఇక ఆస్ట్రేలియా జట్టు చేతిలో దారుణంగా ఓడిపోయింది. దీంతో ఇక టైటిల్ గెలవాలి అన్న కల భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా కలగానే మిగిలిపోయింది అని చెప్పాలి. ఒకవేళ భారత జట్టు టైటిల్ గెలిచి ఉంటే ఆ ఆనందం మాటల్లో వర్ణించలేని విధంగా ఉండేది అయితే భారత జట్టు టైటిల్ గెలిచిందంటే ఇక వరల్డ్ కప్ టైటిల్ను ఎంత అపురూపంగా చూసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇటీవలే ఫైనల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా ప్లేయర్లు మాత్రం వరల్డ్ కప్ టైటిల్ను అవమానించారు. ఇక మరోసారి ఆస్ట్రేలియా తమ బుద్ధిని చూపించింది అంటూ ఒక ఫోటో వైరల్ గా మారిపోయింది.
2008లో ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకునే సమయంలో బీసీసీఐ ప్రెసిడెంట్ తో ఆస్ట్రేలియా అమర్యాదగా ప్రవర్తించడం ఇంకా అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇటీవల భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో విజయం సాధించిన తర్వాత.. ఆస్ట్రేలియా క్రికెటర్లు వరల్డ్ కప్ ట్రోఫీతో ఫోటోలు దిగారు. ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న మిచెల్ మార్ష్ వరల్డ్ కప్ పై కాళ్లు పెట్టి.. బీరు తాగుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. దీంతో అపురూపంగా చూసుకోవాల్సిన వరల్డ్ కప్ ను ఇలా కాళ్ళ కింద పెట్టి ఏకంగా ఆస్ట్రేలియా జట్టు అవమానించింది అంటూ ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.