వరల్డ్ కప్ లో.. ఏడు వికెట్ల వీరులు వీళ్లే?

praveen
వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు పెద్ద గండం గడిచింది. అదేంటి ఇంకా ఫైనల్ మ్యాచ్ పూర్తవనే లేదు అప్పుడే గండం గడిచింది అనుకుంటే ఎలా అంటారా.. అయితే ఫైనల్ మ్యాచ్లో తలపడే జట్టుతో పోల్చి చూస్తే.. న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ టీమ్ ఇండియాకు అతిపెద్ద గండం లాంటిది. ఎందుకంటే ఇప్పటివరకు భారత జట్టుకు అటు న్యూజిలాండ్ పై ఎక్కడ మంచి గణాంకాలు లేవు. దానికి తోడు 2019 వరల్డ్ కప్ లోను భారత జట్టు న్యూజిలాండ్ చేతిలోనే ఓడిపోయి ఇంటి బాట పట్టింది.


 దీంతో ఇక న్యూజిలాండ్తో ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా భారత అభిమానుల్లో టెన్షన్ ఉంటుంది. ఇక సెమి ఫైనల్ లో న్యూజిలాండ్ తో మ్యాచ్ అంటే ఆ టెన్షన్ రెట్టింపు అవుతూ ఉంటుంది. ఇటీవల  న్యూజిలాండ్,  ఇండియా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో అందరిలో ఇలాంటి టెన్షన్ నిండిపోయింది. ఇలాంటి సమయంలోనే భారత్ భారీ స్కోర్ చేసిందని అందరిలో ధైర్యం ఉండగా.. ఇక స్కోరును న్యూజిలాండ్ బ్యాటర్లు సమర్థవంతంగా చేదిస్తున్న సమయంలో మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఇలాంటి సమయంలోనే అందరి టెన్షన్ పడగొట్టి రిలీఫ్ ఇచ్చాడు భారత సీనియర్ బౌలర్ మహమ్మద్ షమి.


 ఏకంగా అతను బంతి వేస్తున్నాడు అంటే చాలు ఇక ప్రతి బంతికి వికెట్ దక్కుతుందేమో అన్న రీతిలో అతని బౌలింగ్ సాగింది  ఈ క్రమంలోనే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్లు తీసి ఒకరకంగా అటు కివీస్ ఓటమిని శాసించింది అతను ఒక్కడే అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏడు వికెట్లతో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు  తొలిసారిగా 1983లో ప్రపంచ కప్ లో వెస్టిండీస్ బౌలర్ విన్ స్టేన్ డేవిస్ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో 7 వికెట్లు పడగొట్టాడు  అయితే తర్వాత 20 ఏళ్లకు ఈ రికార్డు నమోదు కాలేదు. 2003 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా బౌలర్లు గ్లెన్ మెగ్రాత్ ఈ ఫీట్ సాధించాడు. 2017లో టీమ్ సౌదీ ఇంగ్లాండ్ పై ఈ రికార్డు సాధించగా.  ఇప్పుడు భారత బౌలర్ షమీ న్యూజిలాండ్ పై ఈ ఘనతను అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: