వరల్డ్ కప్ లో.. టీమిండియా ఎన్నిసార్లు ఫైనల్ వెళ్లిందో తెలుసా?

praveen
ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు ఎంత అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లీగ్ దశ నుంచే దూకుడు చూపిస్తున్న భారత జట్టు.. ప్రతి మ్యాచ్లో కూడా విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. అయితే సొంత గడ్డమీద జరుగుతున్న వరల్డ్ కప్ నేపథ్యంలో భారత జట్టుపై ఉన్న అంచనాలు అందరిలో కూడా రెట్టిపోయాయి. ఈ క్రమంలోనే ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు మించి ప్రదర్శన చేస్తుంది టీమిండియా. లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్లలో అన్నింట విజయం సాధించింది అని చెప్పాలి.


 అయితే గత వరల్డ్ కప్లలో కూడా టీమిండియా ఇలా లీగ్ దశలో మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకున్నప్పటికీ ఇక కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో మాత్రం చేతులెత్తేస్తూ నిరాశ పరుస్తూ ఉంది. దీంతో ఇక లీగ్ దశలో విజయాలు సాధించినందుకు అభిమానులు హ్యాపీగా ఉన్నప్పటికీ సెమీఫైనల్ లో ఏం జరుగుతుందో అనే టెన్షన్ మాత్రం అందరిలోనిండిపోయింది. అంతకుమించి న్యూజిలాండ్తో మ్యాచ్ అనేసరికి ఈ టెన్షన్ మరింత రెట్టింపు అయింది. అయితే అటు సెమీఫైనల్ లోను అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఘనవిజయాన్ని అందుకొని ఫైనల్ లో అడుగు పెట్టింది.



 ఈ క్రమంలోనే రెండో సెమీఫైనల్ లో గెలిచే జట్టును ఫైనల్ లో ఢీ కొట్టి విశ్వవిజేతగా నిలిచేందుకు ఆతృతగా ఎదురు చూస్తుంది టీమిండియా. అయితే ఇప్పటివరకు భారత జట్టు ఎన్నిసార్లు ఫైనల్ కు వెళ్ళింది అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

 మొదటిసారి 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో ఫైనల్ కు వెళ్లిన టీమిండియా వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.

 ఇక 2003లో గంగూలీ కెప్టెన్ గా ఉన్న సమయంలో ఫైనల్ కు వెళ్ళింది టీమిండియా. ఆ సమయంలో రన్నర్ ఆఫ్ తోనే సరిపెట్టుకుంది.

 2011లో ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో ఫైనల్ కు వెళ్లిన టీమిండియా.. శ్రీలంకను ఓడించి విజేతగా నిలిచింది.

 ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత 2023లో రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ఫైనల్ అడుగుపెట్టింది టీమిండియా. మరి విశ్వవిజేతగా నిలుస్తుందా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: