సెమీఫైనల్.. క్రికెట్ ఫ్యాన్స్ కి ఇది పండుగ లాంటి న్యూస్?

praveen
అక్టోబర్ 5వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియాలో ప్రారంభమైన వన్డే ప్రపంచకప్ 2023 ఎడిషన్ ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా సాగి ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించింది. ఇలా ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ప్రపంచ కప్ టోర్ని ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. నేటి నుంచి సెమీఫైనల్ మ్యాచ్ లు జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే సెమీఫైనల్ లో ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు అర్హత సాధించాయి. ఈ క్రమంలోనే నేడు ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే 2019లో ఇండియాను, న్యూజిలాండ్ ఓడించింది. దీంతో ఈ రెండు టీమ్స్ మధ్య మరోసారి సెమీఫైనల్ పోరు జరుగుతూ ఉండడంతో.. ఇక ఈ మ్యాచ్లో ఫలితం ఎలా ఉంటుందో అన్నదానిపై కూడా అందరిలో ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక ఒక బ్యాడ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఆందోళన కలిగించింది. మ్యాచ్ జరగబోయే ముంబైలోని వాంకడే స్టేడియంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

 దీంతో మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అనే విషయంపై ప్రేక్షకులు ఆందోళన చెందారు. అయితే ఇలా ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ విషయంలో ఇప్పుడు వాతావరణ శాఖ అధికారలు ఒక పండుగలాంటి వార్త చెప్పారు. ఈరోజు ముంబైలో వర్షం పడే అవకాశం లేదు అంటూ స్పష్టం చేశారు. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు. వర్షం పడలేదంటే ఇరు జట్ల మధ్య హోరాహోరి పోరు జరగడం ఖాయమని ఫిక్స్ అయిపోతున్నారు. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన టీమిండియా దూకుడు మీద ఉండగా అతి కష్టం మీద సెమిస్ లో అడుగుపెట్టిన న్యూజిలాండ్  భారత్ పై ఎప్పటిలాగే ఆధిపత్యం సాధించాలని భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: