నన్ను వరల్డ్ కప్ కు.. సెలెక్ట్ చేస్తారా చేయరా.. క్లారిటీ ఇవ్వండి?
ఈ వరల్డ్ కప్ లో దారుణంగా విఫలమైన పాకిస్తాన్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి ఏకంగా పాక్ మాజీలు సైతం ఇదే విషయంపై విమర్శలు చేశారు. అయితే ఇక పాకిస్తాన్ టీంలో సీనియర్ ప్లేయర్ గా కొనసాగుతున్న షోయబ్ మాలిక్ సైతం సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ ప్రదర్శన ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు అంటూ కామెంట్ చేశాడు. అయితే ఇప్పుడు మరోసారి ఈ సీనియర్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేయడం.. వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. గతంలోనే తాను 2024 వరల్డ్ కప్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ కామెంట్ చేశాడు.
ఇక ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి ప్రస్తావనకు తెచ్చాడు ఈ సీనియర్ క్రికెటర్. నేను ఇంకా క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. 2024 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కు నేను కావాలి అంటే వెంటనే క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే టి20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన క్రిస్ గేల్ రికార్డును నేను బద్దలు కొట్టాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా 41 ఏళ్ళ ఈ సీనియర్ ప్లేయర్ గతంలో టెస్టులు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టి20 లకు మాత్రం రిటర్మెంట్ ప్రకటించలేదు అని చెప్పాలి. మరి అతని విజ్ఞప్తిపై అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలా స్పందించబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.