వారెవ్వా.. సచిన్, యువీ సరసన నిలిచిన అయ్యర్?

praveen
2023 వరల్డ్ కప్ లో టీమిండియా ఫుల్ ఫామ్ లో ఉంది. అన్ని జట్లను చిత్తు   చేస్తూ వరుస విజయాలు సాధిస్తూ అదరగొడుతుంది. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శనలతో టాక్ ఆఫ్ ది వరల్డ్ కప్ గా మారిపోయింది టీమిండియా. అయితే ఇటీవల నెదర్లాండ్స్ లో జరిగిన మ్యాచ్ లో అయితే టీమిండియా బ్యాటింగ్ విభాగం మొత్తం వీర బాదుడు బాదింది. ఏకంగా 400 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో పసికూనపై 160 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా.


 అయితే నెదర్లాండ్స్ తో మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ తో పాటు కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా సెంచరీలతో చెలరేగిపోయారూ. కేఎల్ రాహుల్ 62 బంతుల్లో 101 పరుగులు చేస్తే.. శ్రేయస్ అయ్యర్ 94 బంతుల్లో 123 పరుగులు చేశాడు. ఇక ఈ సెంచరీ తో అయ్యర్ ఎన్నో అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వాస్తవానికి ప్రపంచ కప్ లో నెంబర్ 4 బ్యాట్స్మెన్ గా సెంచరీ చేసిన మూడో భారతీయ ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ ల పేరిట మాత్రమే ఉండేది.


 1999 ప్రపంచ కప్ టోర్నీలో సచిన్ టెండుల్కర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇక 2011 ప్రపంచ కప్ టోర్నీలో యువరాజ్ సింగ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చి శతకం సాధించాడు. ఇప్పుడు ఈ ఇద్దరి లెజెండ్స్ సరసన శ్రేయస్ అయ్యర్ కూడా చోటు దక్కించుకున్నాడు. వరల్డ్ కప్ లో అయ్యర్ కి ఇదే తొలి సెంచరీ. అలాగే వన్డే ఫార్మాట్లో కూడా అత్యుత్తమ స్కోర్ అని చెప్పాలి. ఇప్పటివరకు శ్రేయస్ అయ్యర్ వన్డే ఫార్మాట్లో నాలుగు సార్లు సెంచరీ మార్క్ అందుకోగా.. 17 సార్లు 50 కి పైగా పరుగులు చేశాడు. అయితే అయ్యర్ వీరబాదుడు ముందు చిన్న టీమ్ అయిన నెదర్లాండ్స్ బౌలర్లు అందరూ కూడా బెంబెలెత్తిపోయారు. కాగా ఈ వరల్డ్ కప్ లో అయ్యర్ ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: