సెమీఫైనల్ లో.. ఇండియాకు విండీస్ దిగ్గజం కీలక సూచన?

praveen
2023 వన్డే వరల్డ్ కప్ లో టీం ఇండియా అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. వరుస విజయాలు సాధిస్తూ అదరగొడుతుంది. ఇలాంటి సమయంలో ఇక భారత అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు మాత్రం టీమిండియా ఫ్యాన్స్ అందరికీ కూడా కొత్త టెన్షన్ పట్టుకుంది. అదే సెమీఫైనల్ భారత జట్టు 8 విజయాలతో సెమీఫైనల్ అడుగు పెట్టిన మొదటి జట్టుగా రికార్డు సృష్టించింది.


 ఇక నేడు నెదర్లాండ్స్ తో జరగబోయే మ్యాచ్లో కూడా టీమిండియా తప్పక విజయం సాధిస్తుంది. దీంతో లీగ్ మ్యాచ్లో ఆడిన 9 మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా సెమీఫైనల్ చేరిన జట్టుగా రికార్డ్ సృష్టిస్తుంది. అయితే సెమీఫైనల్ లో న్యూజిలాండ్ జట్టుతో మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా. అయితే గత కొన్ని వరల్డ్ కప్ ల నుంచి చూసుకుంటే టీమిండియా సెమీఫైనల్ వరకు బాగా రానించిన.. కీలకమైన నాకౌట్ పోరులో మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తుంది. అది కూడా న్యూజిలాండ్ పై అటు టీమిండియా కు ఎక్కడ మెరుగైన గణాంకాలు లేవు.

 దీంతో సెమీఫైనల్ లో ఏం జరుగుతుందో అని అటు భారత అభిమానులు అందరూ కూడా టెన్షన్ లో మునిగిపోతున్నారు. ఇలాంటి సమయంలో వెస్టిండీస్ దిగ్గజ వివియన్ రిచర్డ్స్ టీమ్ ఇండియాకు సెమీఫైనల్ లో పలు సూచనలు ఇచ్చాడు. టోర్నీలో ఇప్పటివరకు ఎలాంటి మైండ్ సెట్ తో అయితే టీమిండియా ఆడిందో.. ఇక ముందు కూడా దాన్ని అలాగే కొనసాగించాలి. సెమీఫైనల్ లో ఏం జరుగుతుందో అనే భయాలు ఉండడం సహజం. కానీ ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ వివిఎన్ రిచర్డ్స్ సూచించాడు. కాగా నవంబర్ 15వ తేదీన టీమిండియా జట్టు న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: