కోహ్లీకి.. ఇతర ఆటగాళ్లకు తేడా అదే : విండీస్ దిగ్గజం
అంతలా తన ఆట తీరుతు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అంతేకాదు ప్రపంచ క్రికెట్కు రికార్డుల రారాజు అనే ఒక బిరుదును కూడా అందుకున్నాడు విరాట్ కోహ్లీ. ఎందుకంటే ఎంతోమంది లెజెండ్స్ కెరియర్ కాలం మొత్తంలో సాధించిన రికార్డులను విరాట్ కోహ్లీ అతి తక్కువ సమయంలోనే బద్దలు కొట్టి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే జట్టులోకి వచ్చి దశాబ్ద కాలం గడిచిపోతున్న ఇంకా కొత్తగా వచ్చిన ఆటగాడిలో ఉన్నంత కసి కోహ్లీలో ప్రతి మ్యాచ్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది.
ఇలాంటి స్వభావమే కోహ్లీని అందరిలో కెల్లా ప్రత్యేకంగా నిలబెట్టింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కోహ్లీ ప్రతిభ గురించి వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇతర ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ మధ్య ఉన్న ప్రధాన తేడా అతడి మానసిక బలమే అంటూ చెప్పుకొచ్చాడు. ఒకానొక సమయంలో కష్టకాలంలోకి వెళ్ళిన విరాట్ కోహ్లీ ఇప్పుడు తిరిగి సత్తా చాటుతున్నాడు అంటూ హర్షం వ్యక్తం చేశాడు వివ్ రిచర్డ్స్. క్రికెట్ లో టాలెంట్ ఉన్నవాళ్లు ఎంతోమంది.. కానీ విరాట్ మించి మరొకరిని చూడలేము. నేను ఎంతో కాలంగా విరాట్ అభిమానిని మైదానంలో అతని తీవ్రత నాలాగే ఉంటుంది అంటూ వివ్ రిచర్డ్స్ చెప్పుకొచ్చాడు.