డిసెంబర్ 10వ తేదీన.. ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్?

praveen
వరల్డ్ క్రికెట్లో ఎన్నో టీమ్స్ ఉన్నాయి. ఇక ఆయా టీమ్స్ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ ఎప్పుడూ తలబడుతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ వరల్డ్ క్రికెట్లో ఏ రెండు జట్లు తలబడిన రానంత హైప్ మాత్రం కేవలం ఇండియా పాకిస్తాన్ జట్లు తలబడినప్పుడు మాత్రమే వస్తూ ఉంటుంది. ప్రపంచ క్రికెట్లో దాయాది దేశాలుగా పిలుచుకునే ఇండియా, పాకిస్తాన్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా అది హై వోల్టేజ్ మ్యాచ్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.


 ఇక ఆ మ్యాచ్ ని కేవలం ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు క్రికెట్ ప్రపంచం మొత్తం కాస్త కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంటుంది. అంతలా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ప్రపంచ క్రికెట్లో అందరికీ ఫేవరెట్ గా మారిపోయి హవా నడిపిస్తుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ ఏడాది మాత్రం వరుసగా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూసే అవకాశం అందరికీ లభించింది. ఆసియా కప్ లో భాగంగా రెండుసార్లు ఇలా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఇక వరల్డ్ కప్ లో కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చూసి తెగ ఎంజాయ్ చేశారు ప్రేక్షకులు. అయితే డిసెంబర్ 10వ తేదీన మరోసారి ఈ దాయాదుల పోరు చూసేందుకు అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.


 డిసెంబర్ 10వ తేదీన ఏం ఐసీసీ టోర్నీ ఉందని మళ్ళీ పాకిస్తాన్,ఇండియా మ్యాచ్ చూడడానికి అనుకుంటున్నారు కదా. యూఏఈ వేదికగా అండర్ 19 మెన్స్ ఆసియా కప్ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ షెడ్యూల్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. డిసెంబర్ 8 నుంచి 17 వరకు మ్యాచులు జరగబోతున్నాయి. గ్రూప్ ఎ లో భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ జట్లు ఉండగా.. గ్రూపు బీలో బంగ్లాదేశ్ శ్రీలంక యూఏఈ జపాన్ దేశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ టోర్నిలో భాగంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ డిసెంబర్ 10వ తేదీన జరగబోతుంది. ఈ ఏడాది జరిగిన మెన్స్ సీనియర్ ఆసియా కప్ ను భారత జట్టు కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: