బర్త్ డే రోజే.. సెంచరీలు సాధించిన లేయర్లు వీళ్ళే?

praveen
విరాట్ కోహ్లీ బర్త్ డే అంటే కేవలం భారత్ క్రికెట్ ప్రేక్షకులకు మాత్రమే కాదు క్రికెట్ ప్రపంచానికి మొత్తం ఎంతో స్పెషల్. ఎందుకంటే నేటితరంలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. ఇక ప్రపంచ క్రికెట్లో తరతరాలుగా గొప్పగా చెప్పుకునే క్రికెటర్ అనడంలో సందేహం లేదు. దాదాపు దశాబ్ద కాలం నుంచి ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్గా హవా నడిపిస్తూ ఉన్నాడు విరాట్ కోహ్లీ. మామూలుగానే ఇలా కోహ్లీ బర్త్ డే అంటే ఎంతో స్పెషల్. కానీ అతని 35వ పుట్టినరోజు మాత్రం అందరికీ మరింత స్పెషల్ గా మారిపోయింది.


 దీనికి కారణం కోహ్లీ హోమ్ గ్రౌండ్ అని చెప్పుకునే ఈడెన్ గార్డెన్స్ లో.. తన 35వ పుట్టినరోజు నాడు సూపర్ సెంచరీ సాధించాడు. క్రికెట్ గాడ్ అయిన సచిన్ 49 సెంచరీల రికార్డును సమం చేశాడు. అంతకుమించి ప్రతిష్టాత్మకమైన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఈ సెంచరీ సాధించాడు. దీంతో ఈ బర్త్ డే ఎంతో స్పెషల్ గా మారిపోయింది. అయితే కోహ్లీ ఇలా పుట్టినరోజు నాడు సెంచరీ చేసిన నేపథ్యంలో.. కోహ్లీ లాగే బర్త్ డే రోజు సెంచరీ కొట్టిన బ్యాట్స్మెన్లు ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే కోహ్లీ కన్నా ముందు ఆరుగురు మాత్రమే ఇలా పుట్టినరోజు నాడు సెంచరీ కొడితే.. ఇందులో ఇద్దరు మాత్రమే వన్డే ఫార్మాట్లో ఇలా సెంచరీ సాధించారు.


ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే..

1. వినోద్ కాంబ్లీ ( ఇండియా) (21వ పుట్టినరోజు) - 100* vs ఇంగ్లాండ్, జైపూర్ (1993)

2. సచిన్ టెండూల్కర్ ( ఇండియా) (25వ పుట్టినరోజు) - 134 vs ఆస్ట్రేలియా, షార్జా (1998 )

3. సనత్ జయసూర్య (శ్రీలంక) (39వ పుట్టినరోజు) - 130 vs బంగ్లాదేశ్, కరాచీ (2008)

4. రాస్ టేలర్ ( కివీస్) (27వ పుట్టినరోజు) - 131* vs పాకిస్తాన్, పల్లెకెలె (2011)

5. టామ్ లాథమ్ ( కివీస్) (30వ పుట్టినరోజు) - 140* vs నెదర్లాండ్స్, హామిల్టన్ (2022)

6. మిచెల్ మార్ష్ (ఆసిస్ ) (32వ పుట్టినరోజు) - 121 vs పాకిస్థాన్, బెంగళూరు (2023)

7. విరాట్ కోహ్లీ ( ఇండియా) (35వ పుట్టినరోజు) - 100* vs దక్షిణాఫ్రికా, కోల్‌కతా (2023)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: