ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుని.. వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ?
ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన వ్యూహాలతో ఇప్పటివరకు వరల్డ్ కప్ లో ఆడిన ఆరు మ్యాచ్ లలో కూడా ఆరు విజయాలను అందించడంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. అయితే ఇటీవల ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్లో భారత బ్యాటింగ్ విభాగం మొత్తం విఫలమైన సమయంలో రోహిత్ మాత్రం కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 87 పరుగులు చేసి రాణించాడు అని చెప్పాలి. అతను 87 పరుగులు చేయడంతోనే ఇంగ్లాండ్తో మ్యాచ్లో భారత జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. అయితే ఇలా మంచి ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా దక్కించుకున్నాడు అని చెప్పాలి.
ఈ అవార్డుతో ఒక ఆరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. వరల్డ్ కప్ హిస్టరీలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న ఓల్డెస్ట్ కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. 36 ఏళ్ల 183 రోజుల వయసులో ఈ అవార్డును అందుకున్నాడు హిట్ మ్యాన్. అయితే ఒకే వరల్డ్ కప్ లో రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న తొలి భారత ఆటగాడిగాను అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. అంతేకాదు వన్డే క్రికెట్ లో ఒకే ఏడాదిలో 100 ఫోర్లు, 50 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్ గా కూడా రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ. కాగా ఇంగ్లాండ్ జట్టుతో 100 పరుగులు తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఇక సెమి ఫైనల్లో బెర్త్ ను ఖాయం చేస్తుంది.