ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి.. భళా ఆఫ్గాన్?
కాగా ఇప్పుడు వరకు ఆఫ్ఘనిస్తాన్ జట్టు వరల్డ్ కప్ లో భాగంగా మూడు విజయాలు సాధించింది. ఈ మూడు కూడా చారిత్రాత్మక విజయాలు కావడం గమనార్హం. అయితే వరల్డ్ కప్ హిస్టరీలో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమ్స్ మీదే ఆఫ్ఘనిస్తాన్ జట్టు వరుస విజయాలను అందుకుంటుంది. వరల్డ్ కప్ లో భాగంగా డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఇంగ్లాండును.. చిత్తుగా ఓడించిన ఆఫ్గనిస్తాన్ ఆ తర్వాత టైటిల్ ఫేవరెట్ అయిన పాకిస్తాన్ కూడా క్రికెట్ చరిత్రలో మొదటిసారి ఓడించి రికార్డు సృష్టించింది. మరో పటిష్టమైన టీం శ్రీలంకను సైతం ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది ఆఫ్గనిస్తాన్.
అయితే ఇలా వరుస విజయాల వెనుక ఆఫ్ఘనిస్తాన్ ఎలాంటి ప్లానింగ్ తో ముందుకు సాగుతుంది అన్నదానికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 242 పరుగులు టార్గెట్ ను ఎలా చేదించాలి అనే విషయంపై ముందుగానే ప్లానింగ్ వేసుకుంది ఆఫ్గనిస్తాన్. ఎన్ని ఓవర్లకు ఎంత స్కోర్ చేసి టార్గెట్ ను రీచ్ కావాలి అనే దానిపై పక్క ప్లానింగ్ వేసుకుంది. ప్రతి 10 ఓవర్లకు 50 రన్స్ కొట్టాలన్న ప్లాన్ కు సంబంధించిన ఫోటో వైరల్ అవుతుంది. ఇక పక్క ప్రణాళిక ప్రకారమే బరిలోకి దిగిన ఆఫ్గనిస్తాన్.. ఆ ప్లాన్ ని సక్సెస్ఫుల్గా అమలు చేసి విజయం సాధించారు అన్న విషయం తెలుస్తుంది.