కేవలం 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గట్టిగా అదుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఇంకా ఈ క్రమంలో రోహిత్ శర్మ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.కేవలం 66 బంతుల్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 24 ఓవర్లకు టీమిండియా స్కోర్: 89/3 గా ఉంది. క్రీజులో రోహిత్ శర్మ , కే ఎల్ రాహుల్ పరుగులతో ఉన్నారు.ఇక అంతకముందు శ్రేయస్ అయ్యర్(4) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 11.5వ ఓవర్లో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో మార్క్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి శ్రేయాస్ అయ్యర్ పెవిలియన్ చేరాడు. 12 ఓవర్లలో భారత్ స్కోరు కేవలం 40-3 గా మాత్రమే ఉంది.ఇక 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది.అప్పుడు క్రీజులో రోహిత్ శర్మ(24), శ్రేయస్ అయ్యర్(2) పరుగులతో ఉన్నారు.మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే మరో బిగ్ షాక్ తగిలింది.
27 పరుగుల వద్ద కింగ్ విరాట్ కోహ్లి రూపంలో భారత్ రెండో వికెట్ ని కోల్పోయింది. విరాట్ కోహ్లి ఈ మ్యాచ్ లో తన ఖాతా తెరవకుండానే డేవిడ్ విల్లీ బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు.తరువాత క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు.ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 26 పరుగుల వద్ద మొదటి వికెట్ ని కోల్పోయింది.కేవలం 9 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. తరువాత క్రీజులోకి కింగ్ కోహ్లి వచ్చాడు.టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇక 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. అప్పుడు క్రీజులో శుబ్‌మన్ గిల్(4), రోహిత్ శర్మ(0) ఉన్నారు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా లక్నో వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఇప్పుడు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కూడా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.