ఇంగ్లాండ్ ఇక ఇంటికేనా.. సెమీస్ అవకాశాలు లేనట్లేనా?
బజ్ బాల్ అనే కొత్త కాన్సెప్ట్ తో వరల్డ్ కప్ లో బరిలోకి దిగింది ఇంగ్లాండ్ జట్టు. ఇదే కాన్సెప్ట్ తో ద్వైపాక్షిక సిరీస్లలో సూపర్ సక్సెస్ అయింది అని చెప్పాలి. అయితే ఈ వరల్డ్ కప్ లో జట్టును పాటిష్టంగా మార్చేందుకు బెన్ స్టోక్స్ లాంటి ఆటగాడు తీసుకున్న రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా చేసి మరీ జట్టులో చేర్చుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఇలా వరల్డ్ కప్ లో గెలిచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అటు 2023 వరల్డ్ కప్ మాత్రం ఇంగ్లాండ్ జట్టుకు మాత్రం పీడ కలలాగే మిగిలిపోతుంది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండు వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినట్లు తెలుస్తోంది.
పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ఇంగ్లీష్ టీం ఆదివారం భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోతే మాత్రం దాదాపు ఇంటి దారి పట్టినట్లే. అయితే ఇప్పటికే సెమీస్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. ఒకవేళ భారత్తో విజయం సాధించిన భారీ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. అడపాదడపా విజయం సాధించిన ఇక ఇంగ్లాండ్ కు ఇంటి బాట పట్టే పరిస్థితిలే ఏర్పడతాయి. అయితే బట్లర్ సేన మిగతా నాలుగు మ్యాచ్లు గెలిచిన.. ఇతర జట్ల ఫలితాలపైనే ఆ టీం సెమీఫైనల్ తలరాత ఆధారపడి ఉంది అని చెప్పాలి.