ఓరి నాయనో.. ఎగ్ కర్రీ వండలేదని.. భార్యను చంపేశాడు?
ఏకంగా చాక్లెట్ తిన్నంత ఈజీగా ఎదుటి వ్యక్తి ప్రాణాలను తీయడానికి కూడా మనిషి వెనకడుగు వేయడం లేదు. అది కూడా చిన్న చిన్న కారణాలతోనే క్షణికావేషం లో విచక్షణ కోల్పోతున్న మనిషి ముందు వెనుక ఆలోచించకుండా దారుణంగా సాటి మనుషుల ప్రాణాలనే గాలిలో కలిపేస్తున్నారు. అయితే పరాయి వ్యక్తుల విషయంలోనే కాదు సొంత వారి విషయంలో కూడా ఇలా కాస్తయినా జాలీ దయ చూపించడం లేదు. ఇక ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో తరచూ వెలుగులోకి వస్తూ.. ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.
జగిత్యాల జిల్లాలో జరిగిన ఘటన అయితే మరింత దారుణంగా ఉంది. ఏకంగా భార్యను ఎగ్ కర్రీ వండమని చెప్పాడు భర్త. కానీ ఆమె మాత్రం వండలేదు. దీంతో కోపంతో విచక్షణ కోల్పోయాడు. ఇలా ఎగ్ కర్రీ వండలేదు అన్న కారణంతో భార్యను హత్య చేశాడు. టి ఆర్ నగర్ కు చెందిన సంజయ్, సుమలత భార్యాభర్తలు. అయితే ఇటీవలే ఫుల్లుగా మద్యం సేవించిన సంజయ్ ఎగ్ కర్రీ ఎందుకు వండలేదని సుమలతతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే కోపంతో భార్య గొంతు నులిమి హత్య చేశాడు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంజయ్ ని అదుపు లోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికం గా సంచలనగా మారి పోయింది.