ఓరి నాయానో.. ఒకే బంతికి 14 పరుగులు?

praveen
క్రికెట్ అంటేనే ఫన్నీ గేమ్. ఇందులో సాధ్యం కానిది అంటూ ఇంకేది లేదు అన్నట్లుగానే కొన్ని కొన్ని సార్లు ఎంతోమంది ఆటగాళ్లు రికార్డులు సృష్టిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలా కొంతమంది ప్లేయర్లు సృష్టించే రికార్డులు మరొకరి పాలిట మాత్రం చెత్త రికార్డులుగా మారిపోతూ ఉంటాయి. ఇలాంటిది క్రికెట్లో ఎప్పుడైనా జరిగింది అంటే చాలు.. ఇక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది.

 ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన టీమిండియా ఇటీవలే బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లోను ఘనవిజయాన్ని సాధించింది టీమ్ ఇండియా  ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ సెంచరీ తో చెలరేగిపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ఇక ఈ సెంచరీ తో ఎన్నో అరుదైన రికార్డులు కూడా బద్దలయ్యాయి   అయితే ఇక బంగ్లాదేశ్, ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. సాదరణంగా ఒక బంతికి సిక్స్ కొడితే 6 రన్స్.. ఫోర్ కొడితే నాలుగు రన్స్ రావడం అందరికీ తెలుసు. కానీ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మాత్రం ఏకంగా ఒకే బంతికి 14 పరుగులు సాధించింది టీమ్ ఇండియా.

 ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. బాంగ్లాదేశ్ ఫేసర్ హసన్ 13వ ఓవర్లో ఐదవ బంతిని నోబాల్ గా వేశాడు. ఆ సమయంలో ఇక బ్యాట్స్మెన్లు ఒక సింగిల్ తీశారు. దీంతో ఒక్క బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత వేసిన ఫ్రీ హిట్ బంతిని  కోహ్లీ ఫోర్ కొట్టాడు. అయితే ఫ్రీ హిట్ కూడా నోబాల్ అయింది. దీంతో మరో ఫ్రీ హిట్ లభించింది. ఇలా రెండు ఎక్స్ ట్రాలు తోడవడంతో మొత్తం ఒకే బంతికి 14 పరుగులు వచ్చాయి. అయితే ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఒక సిక్సర్ కొట్టి ఔట్ అయ్యాడు అని చెప్పాలి. దీంతో ఇలా ఒక్క బంతికి 14 పరుగులు ఇచ్చిన బంగ్లాదేశ్ బౌలర్ హసన్ ఖాతాలో ఒక చెత్త రికార్డు చేరిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: