శ్రీలంక జట్టుకు షాక్.. వరల్డ్ కప్ నుంచి కెప్టెన్ శనక అవుట్?

praveen
భారత్ వేదికగా అక్టోబర్ 5వ తేదీన ఎంతో గ్రాండ్గా ప్రారంభమైన వన్డే వరల్డ్ కప్ 2023 ప్రస్తుతం ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అని చెప్పాలి. ఇక ప్రతి మ్యాచ్ కూడా నువ్వా నేనా అన్నట్లుగా సాగుతూ.. ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంది. అయితే ఇక ప్రతి టీం కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా హోరాహోరీ పోరును కొనసాగిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో కొన్ని టీమ్స్ కి మాత్రం ఊహించని ఎదురు దెబ్బలు  తగులుతూ ఉన్నాయి. ఏకంగా జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న వారు గాయం బారిన పడుతూ జట్టుకు దూరమవుతున్నారు అని చెప్పాలి.


 మొన్నటికి మొన్న భారత జట్టుకు కూడా ఇలాంటి ఎదురుదెబ్బే తగిలింది. జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగిన గిల్ డెంగ్యూ బారిన పడటంతో మొదటి రెండు మ్యాచ్లకు అతని దూరమయ్యాడు. ఇక వేగంగా అతను కోలుకొని మళ్ళీ పాకిస్తాన్తో మ్యాచ్లో అందుబాటులోకి వచ్చాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లలో ఒకటి శ్రీలంక. ఇక ఇటీవల శ్రీలంకకు ఊహించని భారీ షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది. అని జట్లకు కీలక ఆటగాళ్లు గాయం బారిన పడి జట్టుకు దూరమవుతూ ఉంటే.. అటు శ్రీలంకకు మాత్రం కెప్టెన్ దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.



 ప్రస్తుతం శ్రీలంక జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న దాసున్ శనకకు తొడ కండరాల గాయం అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ మొత్తానికి అతను దూరం కాబోతున్నాడట. డాక్టర్లు అతని గాయాన్ని పరిశీలించి మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే శనకా వరల్డ్ కప్ నుంచి తప్పుకుని స్వదేశం వెళ్లిపోయాడట. కాగా అతని స్థానంలో కరుణ రత్నే జట్టులో చేరనున్నాడు. ఇక కుషాల్ మొండిస్ సారధ్య బాధ్యతలను భుజానా వేసుకోనున్నాడు. ఇక మరో కీలక బౌలర్ ప్రతిరణ కూడా గాయపడ్డాడని.. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో అతను బరిలోకి దిగడు అన్న విషయం కూడా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: