ఒక్క బంతికి 13 రన్స్.. వరల్డ్ కప్లో షాకింగ్ సీన్?
వరల్డ్ కప్ మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి మజాను అందిస్తున్నాయి. క్రికెటర్లు తన రికార్డుల తో అలరిస్తున్నారు. ఫోర్లు, సిక్స్ లు, సెంచరీలతో ఆకట్టుకుంటున్నారు. అంచనాలకు మంచి చిన్న జట్లు కూడా అద్బుతం గా రాణిస్తున్నాయి. తాజాగా నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఒకే బంతికి 13 పరుగులు చేసింది. 50వ ఓవర్ లో చివరి బంతికి కివీస్ 13 పరుగులు సాధించింది. చివరి బంతిని సాంట్నర్ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత అంపైర్ నో బాల్ గా ప్రటించాడు. దీంతో 7 రన్స్ వచ్చాయి.
నో బాల్ కావడం తో మళ్లీ బాల్ వేయగా ఆ బాల్ ను కూడా సాంట్నర్ సిక్స్ కొట్టాడు. దీంతో చివరి బాల్ కు కివీస్ కు 13 పరుగు లు రావడం తో ఈ మ్యాచ్ లో ఆ జట్టు 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 17 బంతుల్లో సాంట్నర్ 36 పరుగులు తీయడం తో పాటు ఐదు వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ విజయం లో అతడు ముఖ్యపాత్ర పోషించాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో 322/7 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని చేదించేందుకు బరి లోకి దిగిన నెదర్లాండ్స్ చతికిలపడింది. 46.3 ఓవర్లో కేవలం 223 పరుగులకే నెదర్లాండ్స్ ఆలౌట్ అయింది. దీంతో 99 పరుగుల తో కివీస్ గెలుపొందింది. న్యూజిలాండ్ ఆటగాళ్ల లో కాన్వే 32, విల్ యంగ్ 70, రచిన్ రవిచంద్ర 51, మిచెల్ 48, లాతం 53 పరుగులు చేశారు. దీంతో 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ 322 పరుగులు చేసింది. కాగా వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ మంచి ప్రదర్శన కనబరుస్తుంది.