ఎప్పటికైనా ఆల్రౌండర్ కావడమే నా లక్ష్యం: తిలక్‌ వర్మ

praveen


టీమిండియా యువ సంచలనం, హైదరాబాదీ తిలక్‌ వర్మ గురించి క్రికెట్ జనాలకి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏమధ్య కాలంలో మనోడు ఇరగదీస్తున్నాడని చెప్పుకోవాలి. ఆసియాక్రీడలు-23లో భారత పురుషల క్రికెట్‌ జట్టు సత్తా చాటిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో తిలక్‌ వర్మ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో షేక్ చేశాడని చెప్పుకోవచ్చు. తొలుత బౌలింగ్‌లో ఒక వికెట్‌ పడగొట్టిన తిలక్‌.. అనంతరం బ్యాటింగ్‌లో దుమ్ములేపాడు. కేవలం 26 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 55 పరుగులు చేసి విజేతగా నిలిచాడు.

ఇకపోతే ఒక బౌలర్ గా ఇంకా మెరుగుపడాలనేదే తన ముందున్న లక్ష్యమని తిలక్ ఓ సందర్బంలో చెప్పుకొచ్చాడు. ఆల్రౌండర్ కావడంకోసం బౌలర్ గా ఇంకా మెరుగు పడేందుకు ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇక దానికోసం మనోడు అశ్విన్, జడేజా లాంటి దిగ్గజాల సూచనలు తీసుకుంటున్నానని తెలిపాడు. కాగా, యువరాజ్, సురేశ్ రైనాల రిటైర్మెంట్ తర్వాత టీమిండియా పార్ట్ టైమ్ స్పిన్నర్ల లోటు ఎదుర్కొంటోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఇండియా బంగారు పతకానికి ఓ అర అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చిత్తు కింద ఓడించి టీమిండియా ఫైనల్లో అడుగు పెట్టింది.

ఈ క్రమంలోనే క్రీడా మైదానంలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో సిక్స్‌ తో హాఫ్‌ సెంచరీ మార్క్‌ ను అందుకున్న తిలక్‌ తన టీషర్ట్‌ పైకెత్తి తన ఒంటిపై ఉన్న పచ్చబొట్టును డగౌట్‌ వైపు చూపిస్తూ తనని తాను శెభాష్ అనిపించుకున్నాడు. కాగా ఆ పచ్చబొట్టు తన తల్లిదండ్రులది కావడంతో సర్వత్రా అతగాడికి ప్రశంసలు లభిస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియో వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ సెలబ్రేషన్స్‌ గల కారణాన్ని మ్యాచ్‌ అనంతరం తిలక్‌ వెల్లడించాడు. "ఈ సెలబ్రేషన్స్‌ మా అమ్మ కోసం. నేను గత కొన్ని మ్యాచ్‌ల్లో బాగా ఆడలేకపోయాను. కానీ మా అమ్మ మాత్రం నాకు ఎల్లప్పడూ మంచి సపోర్ట్‌ గా ఉంటుంది.” అని చెప్పుకురావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: