మ్యాచ్ కు ముందు పులి.. మ్యాచ్ లో పిల్లి.. పాపం పాకిస్తాన్ బౌలర్?
సెప్టెంబర్ 2 న జరిగిన గ్రూప్ మ్యాచ్ లో ఆఫ్రిది 4 వికెట్లు పడగొట్టాడు. ఇండియన్ టీం కీలక ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లను అవుట్ చేసాడు షహీన్ ఆఫ్రిది. ఐతే సూపర్ 4 మ్యాచ్ లో తన ప్రదర్శన మరింత భీకరంగా ఉంటుందని గొప్పలకు పోయాడు ఈ పేసర్. కానీ మ్యాచ్ లో మాత్రం చావు దెబ్బలు తిన్నాడు. మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్, బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా ఓపెనింగ్ పెయిర్ రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ పాకిస్తాన్ బౌలర్లను ఊచకోత కోశారు. అద్భుతమైన షాట్లతో రెచ్చిపోయారు. గత మ్యాచ్ లో విఫలమైన ఈ ఇద్దరు ఈసారి మాత్రం పరుగుల వరద పారించారు. వీరిద్దరూ కలిసి తోలి వికెట్ కు 121 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
ఈ మ్యాచ్ లో షహీన్ ఆఫ్రిది మొదటి స్పెల్ లో వేసిన మూఢ ఓవర్లలోనే 31 పరుగుల సమర్పిచుకున్నాడు. దాంతో పాక్ కెప్టెన్ బాబర్ అజాం స్పెల్ ను బ్రేక్ చేసి ఆఫ్రిది ని పక్కన పెట్టి ఫహీమ్ అష్రాఫ్ ను రంగం లోకి దింపాడు. ఆఫ్రిది వేసిన మొదట ఓవర్లోనే రోహిత్ అద్భుతమైన సిక్స్ తో ఖాతా తెరిచాడు. తరువాత ఆఫ్రిది వేసిన రెండొవ ఓవర్లో మూడు ఫోర్లు, మూడో ఓవర్లో మూడు ఫోర్లతో ఇద్దరు ఓపెనర్లు అతనికి చుక్కలు చూపించారు. ఇదిలా ఉండగా మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం పై పాకిస్తాన్ కెప్టెన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు విశ్లేషకులు.