అంబానీ దెబ్బకు.. దిగొచ్చిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. ఇక అంతా ఫ్రీ?
ఈ క్రమంలోనే ఒక్క మ్యాచ్ కూడా మిస్ చేయకుండా అన్ని మ్యాచ్లను చూస్తూ క్రికెట్ ఎంటర్టైర్మెంట్ పొందాలని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలి అనే విషయంపై కన్ఫ్యూషన్ లో ఉన్నారు. కొంతమంది ఇక ఈ టోర్నీ లను ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ ను ఇక సబ్ స్క్రైబ్ చేసుకోవాలి అందుకు డబ్బులు కావాలి ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారికి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. ఆసియా కప్ ను ప్రత్యక్ష ప్రసారాలు ఉచితంగానే చూడవచ్చు. ఈ విషయంపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అధికారిక ప్రకటన చేసింది.
అయితే ఈ సదుపాయం కేవలం మొబైల్ కు మాత్రమే అన్న కండిషన్ పెట్టింది. కాగా ఐపీఎల్ జియో సినిమా యాప్ ఉచితంగా ప్రసారం చేయడంతో డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ ఎంతోమంది కస్టమర్లను కోల్పోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇక అంబానీ దెబ్బకు డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ కూడా దిగి వచ్చింది అన్నది తెలుస్తుంది. దీంతో జియో సినిమా తరహా లోనే ఇక ఉచితంగా ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు సిద్ధమైంది. అయితే ఈ విషయం తెలిసి అటు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా తెగ సంబరపడిపోతున్నారు. దీంతో ఇంట్లో ఉన్నప్పుడే కాదు ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా కూడా మొబైల్లో మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం ఫ్రీగా చూడవచ్చు అని ఎంతో ఆనంద పడిపోతున్నారు అని చెప్పాలి.