రోహిత్ కు నేను పెద్ద అభిమానిని : ఇంగ్లాండ్ మాజీ

praveen
మరికొన్ని రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ నేపథ్యంలో  ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పూర్తిస్థాయి షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఇక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అన్ని టీమ్స్ కి కూడా ఎక్కడ ఎప్పుడు మ్యాచ్ ఆడబోతున్నాము అనే విషయంపై కూడా ఒక క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి. దీంతో ఇక తమ షెడ్యూల్ కు అనుగుణంగా అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయ్ అన్ని టీమ్స్.


 ఎట్టి పరిస్థితుల్లో భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో విజయం సాధించి విశ్వవిజేతగా నిలవడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి సమయంలో అటు భారత జట్టు కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిపోతుంది. అయితే వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో  ఎంతో మంది మాజీ ఆటగాళ్లు వరల్డ్ కప్ విజేతగా నిలువబోయే టీం ఏది అనే విషయంపై ముందుగానే ఒక అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ప్లేయర్స్ ఇస్తున్న రివ్యూలు కూడా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అంతేకాదు ప్రస్తుతం స్టార్ క్రికెటర్లుగా కొనసాగుతున్న వారు సైతం వరల్డ్ కప్ పై తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండడం గమనార్హం.


 ఈ క్రమంలోనే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఇంగ్లాండు మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మకు తాను పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు. రోహిత్ కెప్టెన్సీ కి నేను పెద్ద ఫ్యాన్. అతడు సారధిగా లేనప్పటికీ మైదానంలో డ్రెస్సింగ్ రూమ్ లో తన పాత్ర పోషిస్తాడు. తోటి ఆటగాళ్లకు రోహిత్ అంటే ఎంతో గౌరవం ఉంటుంది. ఇక ఎప్పుడూ సొంత గడ్డపై వరల్డ్ కప్ జరుగుతుంది. కాబట్టి రోహిత్ అడ్వాంటేజ్ తీసుకోవాలి అంటూ ఇయాన్ మోర్గాన్ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: