అందుకే క్రికెట్లో ఫిట్నెస్ కావాలనేది.. ఇక్కడ ఏం జరిగిందో చూడండి?

praveen
సాదరణంగా క్రికెట్ అనే ఆటలో కొనసాగాలి అంటే ప్రతి ప్లేయర్ కి ఫిట్నెస్ అనేది ఎంతో ముఖ్యమైన విషయం తెలిసిందే. అయితే ఇలా ఫిట్నెస్ను కాపాడుకున్నపుడే ఇక ఆటగాడు ఎక్కువ కాలం పాటు కెరియర్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లగలడు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో క్రికెటర్ల ఫిట్నెస్ ప్రమాణాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక కొంతమంది క్రికెటర్లు అయితే ఫిట్నెస్ విషయంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు  అలాంటి వారిలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు.


 ఎందుకంటే క్రికెటర్లు ఫిట్టుగా ఉన్నప్పుడే అటు వికెట్ల మధ్య పరిగెత్తడమే కాదు మైదానంలో పాదరసంలా కదులుతూ పరుగులను కట్టడం చేసేలా ఫీల్డింగ్  చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అసలు ఫిట్నెస్ అనే విషయమే పట్టించుకోకుండా భారీ కాయంతో ఉన్న ఆటగాడు ఎవరు అంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చేది వెస్టిండీస్ ప్లేయర్ రఖిమ్ కార్నివాల్.  అతను ఆరడుగుల ఆరు అంగుళాలు ఉంటాడు. అతని బరువు 140 కిలోల పైనే. అయితే ఇతను బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే ప్రత్యర్థి బౌలర్లు వణికి పోతూ ఉంటారూ. ఎందుకంటే భారీ సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ ఉంటాడు అని చెప్పాలి.


 అయితే బౌండరీలతో స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించే ఇతగాడు.. వికెట్ల మధ్య పరిగెత్తడంలో మాత్రం తెగ ఇబ్బంది పడుతూ ఉంటాడు  అయితే ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా పరిగెత్తు లేక చివరికి రన్ అవుట్ అయ్యాడు  బార్బడోస్ రాయల్స్ కు ప్రాతినిత్యం  వహిస్తున్నాడు కార్నివ్వాల్. ఇటీవల సెయింట్ లూసియాతో జరిగిన మ్యాచ్లో కార్నివాల్ రనౌట్ గా వెను తిరిగాడు. అయితే రన్ తీసే సమయంలో మరో ఎండులో ఉన్న బ్యాటర్ క్రీజు లోకి చేరుకున్నప్పటికీ కార్నివాల్ మాత్రం బౌలింగ్ ఎండ్వైపు చేరుకోలేకపోయాడు. భారీ కాయం కారణంగా వేగంగా పరిగెత్త లేకపోయాడు. దీంతో రన్ అవుట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: