ఇండియా vs పాక్ మ్యాచ్ టికెట్లు.. ఆ రోజే విడుదలవుతాయట?
ఆగస్టు 30వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఆసియా కప్ తో పాటు ఇక భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో కూడా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఇండియా వేదికగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరు జట్లకు కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైనది. అయితే అక్టోబర్ 5వ తేదీన వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. ఇక అక్టోబర్ 14వ తేదీన ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల కన్ను మొత్తం ఈ దాయాదుల పోరు పైనే ఉంది. దీంతో ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్ని నేరుగా మైదానంలో చూడాలని ఎంతో మంది ఆశపడుతున్నారు. ఈ క్రమంలోనే టికెట్లు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇలా యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ అటు ఐసీసీ క్రికెట్ లవర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కి సంబంధించిన టికెట్స్ సెప్టెంబర్ 3 నుంచి విక్రయించినట్లు ఐసిసి ప్రకటించింది. టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకునేవారు ఇక ఈరోజు నుంచే cricketworldcup.Comవెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.