సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియా.. భారత్ కు ఇదే తొలిసారి?

praveen
వెస్టిండీస్ పర్యటనకు వెళ్ళిన టీమ్ ఇండియా అక్కడ మూడు ఫార్మాట్ లలో కూడా సిరీస్ లు ఆడింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా వన్ డే సిరీస్తో పాటు టెస్ట్ సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది టీమిండియా. అయితే టీ20 సిరీస్ లో మాత్రం దారుణమైన ప్రదర్శన చేసింది అని చెప్పాలి. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయింది. అయితే ఆ తర్వాత మాత్రం మూడో మ్యాచ్లో గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇక నాలుగో మ్యాచ్లో కూడా గెలిచి పట్టు బిగించింది. అయితే ఐదో మ్యాచ్లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంటుందని అభిమానులందరూ భారీగా ఆశలు పెట్టుకున్నారు.


 కానీ ఊహించని రీతిలో టీమ్ ఇండియా ఐదో టి20 మ్యాచ్లో దారుణ ఓటమి చవిచూసింది. దీంతో అప్పటికే రెండు మ్యాచ్లు గెలిచిన వెస్టిండీస్ మూడో మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇలా సిరీస్ గెలుపు కోసం పోరాడినప్పటికీ టీమ్ ఇండియాకు చేదు అనుభవం ఎదురయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ సిరీస్ కోల్పోవడం ద్వారా అటు టీమ్ ఇండియా ఎన్నో చెత్త రికార్డులను కూడా మూటగట్టుకుంది. ఇప్పటివరకు ఐదు టి20 మ్యాచ్ ద్వైపాక్షిక సిరీస్ లో భారత్ 5 సార్లు అడగా.. మూడింటిలో గెలిచి.. ఒక సిరీస్ ను సమం చేసింది. ఇక ఏ ఫార్మాట్లో అయినా అటు టీమిండియా వెస్టిండీస్ పై సిరీస్ ఓడిపోవడం 17 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.


 ఈ క్రమంలోనే టీమిండియా ప్రదర్శన ఏమాత్రం బాగాలేదని ఇదే ఆటతీరును  కొనసాగిస్తే.  ఇక ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ గెలవడం కూడా కష్టమే అంటూ ఎంతో మంది మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మొన్నటి వరకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పై ప్రశంసలు గుర్తించిన మాజీ ప్లేయర్లు ఇక ఇప్పుడు అతని వ్యూహాలు సరిగ్గా లేవు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: