ఇండియాతో మ్యాచ్లో.. మనకు ఎవరు సపోర్ట్ చేయరు.. పాక్ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్?
ఇక ఈ హాట్ ఫేవరెట్ పోరు కోసం అటు అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక ఈ చిరకాల ప్రత్యర్ధుల సమరం ఈసారి ఏకంగా భారత్ వేదికగా జరుగుతూ ఉండడంతో మ్యాచ్ పై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో అటు ఇండియా వేదికగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోయే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ గురించి పాక్ ఆటగాడు షాదాబ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా వేదికగా భారత్తో జరిగే మ్యాచ్కు మానసికంగా సంసిద్ధంగా ఉండాలి అంటూ కామెంట్ చేశాడు షాదాబ్ ఖాన్.
ఇండియాలో ప్రేక్షకుల నుంచి మనకు ఎలాంటి మద్దతు లభించదు. కాబట్టి పాకిస్తాన్ ఆటగాళ్లందరూ మానసికంగా మరింత బలంగా ఉండాలి. మనం మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉంటామో అంత తేలికగా మంచి ఫలితాలు రాబట్టగలుగుతాం అంటూ షాదాబ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. టీమిండియా పై విజయం సాధించడంతోపాటు.. వరల్డ్ కప్ గెలిస్తే అంతకంటే గొప్ప విజయం ఇంకేమీ ఉండదు. నిజానికి ప్రతి జట్టు టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. అయితే మనకు ఎలాంటి ఆరంభం లభించింది ఎలా ముందుకు సాగుతున్నాం అన్న విషయం పైనే అంత ఆధారపడి ఉంటుంది అంటూ షాదాబ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి.