7 నెలల తర్వాత రీ ఎంట్రీ.. తొలి మ్యాచ్ లోనే అదుర్స్?

praveen
భారత క్రికెట్లో కీలకమైన బౌలర్గా కొనసాగుతున్న యుజ్వేంద్ర చాహల్  ఎప్పుడు తన ఆటతీరుతో ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి సరిగ్గా సరిపోయే చాహల్.. తన అద్భుతమైన స్వింగ్ బౌలింగ్ తో ఎంతో మంది స్టార్ బ్యాట్స్మెన్లను తికమక పెట్టి వికెట్ దక్కించుకుంటూ ఉంటాడు. ఇక అతనికి తెలివైన బౌలర్ అనే ఒక ట్యాగ్ కూడా ఇచ్చేశారు భారత క్రికెట్ ప్రేక్షకులు. ఎందుకంటే ఏ బ్యాట్స్మెన్ కి ఎక్కడ బంతి వేస్తే వికెట్ దక్కుతుంది అన్న విషయం అతనికి బాగా తెలుసు.


 అలాంటి చాహల్ ఇక గత కొంతకాలం నుంచి మాత్రం టీమ్ ఇండియాలో సరైన అవకాశాలు దక్కించుకోవట్లేదు. యువ ఆటగాళ్లు తెరమీదకి వస్తున్న నేపథ్యంలో ఇక చాహల్ కు అటు జట్టులో చోటే లేకుండా పోయింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలో జట్టులో ఎంపికైనప్పటికీ తుది జట్టులోకి మాత్రం రాలేకపోయాడు. చివరికి ప్రస్తుతం జరుగుతున్న టి20 సిరీస్ లో మాత్రం అతను ఇక ప్లేయింగ్ లో ఛాన్స్ సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇలా ఏడు నెలల గ్యాప్ తర్వాత టీమిండియాలోకి రీ ఎంట్రీ  ఇచ్చిన చాహల్ కేవలం 3 బంతుల్లోనే విధ్వంసం సృష్టించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.


 ఎందుకంటే మూడు బంతుల్లోనే ఏకంగా కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన తొలి టి20 మ్యాచ్లో బౌలింగ్కు వచ్చిన చాహల్ ఇక తన తొలి బంతికే వికెట్ తీశాడు. చాహాల్ వేసిన బంతికి ఓపెనర్ కైల్ మేయర్స్ ఎల్బిడబ్ల్యుగా ఔట్అయ్యాడు. అయితే కైల్ మేయర్స్ డిఆర్ఎస్ తీసుకొని ఉంటే మాత్రం అటు అవుట్ అయ్యేవాడు కాదు అని చెప్పాలి. ఇక అదే ఓవర్లో మూడో బంతికి చాహల్ రెండో ఓపనర్ బ్రాడ్ కింగ్ ను ఎల్బీడబ్ల్యుగా అవుట్ చేశాడు. అయితే ఈ ప్రదర్శన ద్వారా ఆసియా కప్ తో పాటు వరల్డ్ కప్ ఫ్రాపబల్స్ లో అతను చోటు సంపాదించుకున్నాడు అనడంలో సందేహం లేదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: