అయ్యయ్యో.. వికెట్ కీపర్ చేసిన పనికి.. ప్రత్యర్థి టీం గెలిచింది?

praveen
క్రికెట్ అనేది ఫన్నీ గేమ్ అన్న విషయం తెలిసిందే . అయితే పేరుకు ఫన్నీ గేమ్ అయినప్పటికీ  క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఉండే ఉత్కంఠ మాత్రం అంతా ఇంతా కాదు. అయితే ఇలా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ గా సాగుతున్న సమయంలో మైదానంలో ఉన్న ప్రతి ఆటగాడు కూడా జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఏకంగా అద్భుతమైన ఫీలింగ్ విన్యాసాలు చేయడం చేస్తూ ఉంటాడు. ఇలా విన్యాసాలు చేయడంలో కొంతమంది ప్లేయర్లు సక్సెస్ అయితే ఇంకొంత మంది మాత్రం చివరికి విన్యాసాలు చేయబోయి నవ్వుల పాలు అవుతూ ఉంటారు అని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. క్రికెట్లో జరిగిన ఒక ఫన్నీ సంఘటనకు సంబంధించిన వీడియో.. ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా వికెట్ కీపర్ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను అవుట్ చేద్దాము అనే ఉద్దేశంతో చేసిన పని కాస్త చివరికి అవతలి జట్టును గెలిపించింది. ఇంకేముంది గెలిచే మ్యాచ్ కాస్త ఓడిపోయి అతను నవ్వుల పాలయ్యాడు అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరు కూడా నవ్వుకుంటున్నారు  యూరోపియన్ క్రికెట్ లీగ్ లో భాగంగా యునైటెడ్ క్రికెట్ క్లబ్, పార్క్యూ టైగర్స్ మధ్య మ్యాచ్ జరిగింది.


 అయితే యునైటెడ్ జట్టు గెలవాలంటే చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు చేయాల్సి ఉంది. ఇలాంటి సమయంలోనే ప్రత్యర్థి  బ్యాట్స్మెన్ ను వికెట్ కీపర్ రన్ అవుట్ చేసేందుకు ప్రయత్నించి బంతిని ఫుట్బాల్ లాగా షార్ట్ ఆడాడు. దీంతో గెలవాల్సిన మ్యాచ్ కాస్త చేయి జారింది. ఎందుకంటే వికెట్ కీపర్ బంతిని ఫుట్బాల్ షాట్ ఆడటంతో అది స్టంప్స్ తాగకుండా వెళ్ళిపోయింది. దీంతో ఇద్దరు బ్యాటర్లు రెండు పరుగులు పూర్తి చేశారు  కంగారు పడిన ఫీల్డర్ బంతిని బలంగా విసరడంతో నేరుగా బౌండరీ  దాటింది. ఇలా మరో బంతి మిగిలి ఉండగానే యునైటెడ్ క్రికెట్ క్లబ్ టీం గెలిచింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: