క్యాచ్ లు పట్టడంలో.. కోహ్లీ అరుదైన రికార్డ్?

praveen
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరుతో అతన్ని అతనే పరిచయం చేసుకొని అందరిని తన అభిమానులుగా మార్చుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇక గత దశాబ్ద కాలంగా టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ అటు ప్రపంచక్రికెట్లో తనకు మించిన అత్యుత్తమప్లేరు ఇంకెవరూ లేరు అనే విషయాన్ని కూడా నిరూపించుకున్నాడు విరాట్ కోహ్లీ. అంతేకాదు వరల్డ్ క్రికెట్లో రికార్డుల రారాజుగా కూడా ప్రస్తానం కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

 ఎందుకంటే ఇప్పుడు వరకు ఎంతో మంది లెజెండరీ క్రికెటర్స్ సాధించిన రికార్డులను అలవోకగా చేదించాడు. ఇక నేటితరం క్రికెటర్లతో పోల్చి చూస్తే రికార్డుల విషయంలో ఎవరికీ  అందనంత ఎత్తులో ఉన్నాడు అని చెప్పాలి. అయితే కేవలం బ్యాటింగ్లో మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం విషయంలోనూ విరాట్ కోహ్లీ తోపే అన్న విషయం తెలిసిందే  ఎందుకంటే ఏ స్టార్ క్రికెటర్లకు లేనంతగా అటు కోహ్లీ ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. అయితే ఇక బ్యాటింగ్లో ఎప్పుడు మెరుపులు మెరూపించే విరాట్ కోహ్లీ అటు మైదానంలో పాదరసంలా కదులుతూ మెరుపు ఫీల్డింగ్  తో ఎప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు.

 అందుకే విరాట్ కోహ్లీ వైపుగా బంతి వెళ్ళింది అంటే చాలు బ్యాట్స్మెన్లు కాస్త జాగ్రత్తగా పరుగులు తీస్తూ ఉంటారు  ఇక క్యాచ్ లు పట్టడంలో విరాట్ కోహ్లీ ఎప్పుడు విన్యాసాలు చేస్తూ అబ్బురుపరుస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల వన్డే ఫార్మాట్ లో క్యాచ్ లు పట్టడం విషయంలో కూడా విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డు సృష్టించాడు.  వన్డే ఫార్మాట్లో నాన్ వికెట్ కీపర్ గా అత్యధిక క్యాచ్ లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ నాలుగవ స్థానానికి చేరుకున్నాడు. ఈ లిస్టులో జయవర్ధనే 448 మ్యాచ్ లలో 218 క్యాచ్ లతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. రెండు మూడు స్థానాలు రికీ పాంటింగ్ 375 మ్యాచ్లో 160 క్యాచ్ లు అజారుద్దీన్ 334 మ్యాచ్లో 156 క్యాచ్ లతో ఉన్నాడు. కాగా టైలర్ 236 మ్యాచ్ లలో 142 క్యాచ్ లతో ఉండగా.. విరాట్ కోహ్లీ కూడా 275 మ్యాచ్ లలో 142 క్యాచ్ లు పట్టి టైలర్ తో సంయుక్తంగా నాలుగవ స్థానాన్ని పంచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: