మొండి పట్టు వీడని ఇంగ్లాండ్.. మళ్లీ అదే టీంతో బరిలోకి?

praveen
వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న టీమ్స్ ఏవి అంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అని ప్రేక్షకులు అందరూ కూడా చెప్పేస్తుంటారు. ఎందుకంటే ఈ రెండు జట్లు సమవుజ్జీలుగా కొనసాగుతూ ఎప్పుడు పోరాడినా కూడా ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్  పంచుతూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ఉత్కంఠ మరో లెవెల్ లో ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే యాషెష్ సిరీస్ ను ఈ రెండు టీమ్స్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటాయి. ఈ సిరీస్లో విజయాన్ని గౌరవంగా భావిస్తూ ఉంటాయి అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఈ యాషెష్ సిరీస్ లో తలబడిన ప్రతిసారి కూడా రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతూ ఉంటుంది  ఈ పోరును చూసేందుకు ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మరోసారి ఈ రెండు టీమ్స్ మధ్య యాషెష్ సిరీస్ జరుగుతుంది. ఇక నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న పోరులో ఇప్పటివరకు సిరీస్ విజేత ఎవరు అన్న విషయంలో ఒక క్లారిటీ రాలేదు. అయితే మొదటి రెండు మ్యాచ్లలో దూకుడు చూపించిన ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. మూడో మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకుంటుందని అందరూ అనుకున్నారు.

 కానీ ఊహించనీ రీతిలో మూడో మ్యాచ్లో పుంజుకున్న ఇంగ్లాండు ఘనవిజయం అందుకుంది. అయితే నాలుగో మ్యాచ్లో కూడా విజయం సాధిస్తుంది అనుకున్నప్పటికీ.. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో నేడు ఐదో మ్యాచ్ లో సిరీస్ సమం చేయాలని చూస్తుంది ఇంగ్లాండు టీం. ఈ క్రమంలోనే ఈ ఐదవ టెస్ట్ మ్యాచ్లో ఎలాంటి మార్పులు లేకుండానే నాలుగో టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సిరీస్ లో పెద్దగా ఆకట్టుకోని సీనియర్ ఫేసర్ అండర్సన్  మరోసారి జట్టులో కొనసాగించడం గమనార్హం. చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ కైవసం అవుతుంది. ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: