హిందూపురం:ఆపరేషన్ బాలయ్య వైసీపీ సక్సెస్ అవుతుందా.?

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో హిందూపురం కూడా ఒకటి. టిడిపికి వారసుడైనటువంటి బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాంటి ఆయన ఇప్పటికే రెండుసార్లు ఇక్కడి నుంచి కాంటెస్ట్ చేసి విజయం సాధించారు. అలాంటి టిడిపి కంచుకోటను ఈసారి వైసీపీ బద్దలు కొట్టే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు ఈసారి బాలయ్యను ఎలాగైనా పడగొట్టాలని వైసిపి ఆపరేషన్ బాలయ్య అనే  నినాదంతో ముందు కదిలిందట. మరి ఇందులో వైసీపీ సక్సెస్ అవుతుందా. హిందూపూర్ లో పరిస్థితి ఎలా ఉంది అనే వివరాలు చూద్దాం. టిడిపికి కంచుకోట హిందూపురం.  1983 నుండి ఇక్కడ ఆ పార్టీకి తిరుగులేదు.  సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలు హరికృష్ణ, బాలకృష్ణ నందమూరి కుటుంబీకులే ఇక్కడి నుంచి విజయ బాగుటా ఎగరవేస్తూ వస్తున్నారు.

ఇక 2014, 2019లో కూడా వరుసగా రెండుసార్లు బాలకృష్ణ ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఈసారి కూడా విజయం సాధించి హట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు.  ఈ క్రమంలో బాలయ్యను కట్టడి చేసేందుకు వైసిపి రకరకాల ప్రణాళికలు సిద్ధం చేసిపెట్టుకుంది.  ఆయనకు దీటుగా మహిళా అభ్యర్థి అయినటువంటి దీపికాను బరిలో ఉంచింది. ఈ ఎన్నికల సమయంలో  టిడిపిలో ఉండేటువంటి అసంతృప్తులందరినీ  వైసిపి తన వైపు లాక్కుందట. దీనికి తోడుగా ఈసారి జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు కూడా  కలిసి వస్తాయని టిడిపి నాయకులు భావిస్తున్నారు.  బాలకృష్ణ గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఎక్కువగా ఉండకపోవడం కూడా మరో అంశంగా చెప్పవచ్చు.

 ఈ విధంగా హిందూపురం నియోజకవర్గంలో  దీపిక మహిళా ఓటర్లను ప్రభావితం చేస్తూ  ప్రచారం నిర్వహించింది. ముఖ్యంగా  బాలకృష్ణ స్థానికంగా ఉండరు అనే నినాదాన్ని వినిపించింది. అలాగే టిడిపిలో ఉండేటువంటి అసంతృప్తులు అందరినీ ఏకం చేసి తన వైపు లాక్కుంది. దీంతో ఈసారి బాలకృష్ణకు దీపిక టప్ ఫైట్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఒకవేళ ఆమె వేసిన ఎత్తులన్నీ వర్కౌట్ అవుతే మాత్రం తప్పక బాలకృష్ణ ఓడిపోవడం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి జూన్ 4న ఇలాంటి రిజల్ట్ రాబోతోందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: