టార్గెట్‌ జ‌వ‌హ‌ర్‌రెడ్డి : ఎన్నో ఆటు పోట్లు.. అయినా అలుపెరుగ‌ని విధులు..!

- 2024 ఎన్నిక‌ల్లో కీ రోల్‌తో ప్ర‌జ‌ల్లో గుర్తింపు
- ఎంత టార్గెట్ చేసినా అంతా కూల్ కూల్‌గానే..!
- ఎన్నిక‌ల నిబంధ‌న‌ల ప‌క్కాగా పాటించి ప్ర‌జ‌ల్లో గుర్తింపు..!
( విశాఖ‌ప‌ట్నం - ఇండియా హెరాల్డ్ )
ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. అంటే.. సీఎం త‌ర్వాత సీఎం వంటి అధికారి. రాజ‌కీయంగా సీఎంకు గౌర‌వం .. బాధ్య‌త‌లు ఉంటే.. అస‌లు ప్ర‌భుత్వాన్ని ఎలా ముందుకు న‌డిపించాలి.. స‌ర్కారు తీసుకునే నిర్ణ‌యా లను ఎలా అమ‌లు చేయాలి?  స‌ర్కారుకు-ప్ర‌జ‌ల‌కు అనుసంధానంగా అధికారుల‌ను ఎలా తీర్చిదిద్దాల‌నే బృహ‌త్త‌ర బాధ్య‌త‌లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శిపైనే ఉంటాయి. రాష్ట్రంలో అన్ని విభాగాల అధికారులు.. మొత్తం ఆయ‌న చెప్పుచేత‌ల్లోనే ఉంటారు. ఇదే స‌మ‌యంలో సీఎం కు సైతం ఆయ‌న క‌ళ్లు, చెవులుగా ప‌నిచేస్తారు.

అంత‌టి ఉన్నత‌స్థాయిలో ఉన్న ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. ఒక్క‌సారిగా వివాదాల్లో చిక్కుకున్నారు. ఇవి ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా చేసుకున్న వివాదాలు.. కొని తెచ్చుకున్న వివాదాలు అయితే కాదు. కేవ‌లం రాజ‌కీయంగా రాష్ట్రంలో ఏర్పడిన ఒక ప్ర‌భావ‌వ వంత‌మైన ప‌రిస్థితి ఆయ‌న‌పై ఎఫెక్ట్ చూపించింది. పిం ఛ‌న్ల పంపిణీతో ప్రారంభ‌మైన ఈ వివాదం.. అధికారుల బ‌దిలీలు.. కొత్త అధికారుల‌ను ఎంపిక చేయ‌డం.. వ‌ర‌కు తీవ్ర‌స్థాయిలో సాగింద‌నే చెప్పాలి.

విప‌క్షాలు.. కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌ల సూచ‌న‌ల మేర‌కు ఎన్నిక‌ల సంఘం రాష్ట్రంలో అప్ప‌టి వ‌ర‌కు ఇం టింటికీ సేవ‌లందించిన వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ప‌క్క‌న పెట్టింది. అయితే.. అదే స‌మ‌యంలో సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల పంపిణీ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. ఇది రాజ‌కీయంగా దుమారం రేపింది. ఉద్యోగుల‌ను ఇంటింటికీ పంపించి.. పింఛ‌న్లు పంపిణీ చేయించాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న జ‌వ‌హ‌ర్‌రెడ్డిపై తీవ్ర  ఒత్తిళ్లు వ‌చ్చాయి. అయితే.. ఆయన మాత్రం ఎన్నిక‌ల సంఘం సూచ‌న‌లు, నిబంధ‌నల మేరకే ప‌నిచేశారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను ఓ మీడియా సంస్థ కూడా భారీగానే టార్గెట్ చేసింది. జ‌గ‌న్‌కు మేళ్లు చేసేందుకు వైసీపీని గెలిపించేందుకు జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఇలా చేస్తున్నార‌ని.. ఆ మీడియా ప‌దే ప‌దే ప్ర‌సారం చేసింది. అ యినా.. కూడా జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఎక్క‌డా ఉద్రేకానికి లోనుకాలేదు. తాను ఈసీ నిబంధ‌న‌ల‌మేర‌కే ప‌ని చేశారు. ఇంటింటికీ ఇవ్వ‌డం ఇప్పుడున్న ప‌రిస్థితిలో సాధ్యం కాద‌ని ఆయ‌న ప‌రోక్షంగా తేల్చి చెప్పారు. బ్యాంకు ల్లో న‌గ‌దు జ‌మ‌, స‌చివాలయాల్లో అంద‌జేత వంటికార్య‌క్ర‌మాలు చేశారు. దీనిపై విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించినా.. త‌న‌కు వైసీపీ రంగు పూసినా.. ఆయ‌న ఎక్క‌డా ఆవేశానికి గురి కాకుండా.. వ్య‌వ‌హ‌రించారు.

ఇదేస‌మ‌యంలో అనేక మంది పోలీసులు, క‌లెక్ట‌ర్ల‌ను బ‌దిలీ చేయాల‌ని.. వీరంతా స‌ర్కారుకు అనుకూ లమ‌ని.. వైసీపీని గెలిపించేందుకు ప్ర‌తిప‌క్షాల‌ను తొక్కేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని కొంద‌రు రాజ‌కీయ నేత‌లు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిని ప‌రిశీలించిన ఎన్నికల‌సంఘం వారిని మార్చేసింది. ఈ స‌మయంలో ముగ్గురేసి చొప్పున ప్యాన‌ల్‌ను పంపించాల‌ని కోరింది.. సీఎస్‌గా జ‌వ‌హ‌ర్ రెడ్డి అదే ప‌నిచేశారు. అయితే.. దీనిపై కూడా.. ఆయ‌న‌ను టార్గెట్ చేశారు.

వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారుల‌ను ఏరికోరి పంపించార‌ని.. ముందు జ‌వ‌హ‌ర్‌రెడ్డిని మార్చేస్తే నే త‌ప్ప‌.. రాష్ట్రంలో శాంతి యుతంగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌వంటూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు.. వ‌చ్చాయి. ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. అయినా.. కూడా జ‌వ‌హ‌ర్‌రెడ్డి త‌న ప‌నితానుచేసుకుని పోయారు. విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. పొగ‌డ్త‌లు వ‌చ్చినా.. ఈసీ చెప్పిన‌ట్టే వ్య‌వ‌హ‌రించారు. ప‌లితంగా ఆయ‌న ప‌ద‌వి చెక్కు చెద‌ర‌లేదు.

మ‌రీ ముఖ్యంగా ప‌ల్నాడు, అనంత‌పురం, తిరుప‌తి ప్రాంతాల్లో ఎన్నిక‌ల పోలింగ్ రోజు చెలరేగిన హింసా త్మక ఘ‌ట‌న‌లు రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపాయి. వీటిని సీరియ‌స్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది. నిజానికి అప్పుడే.. ఇక‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని తీసేయ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఆయ‌న ఎన్నిక‌ల వేళ త‌ట‌స్థంగా ఉంటూ.. అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు క‌ల్పించార‌ని ఎన్నిక‌ల సంఘం గుర్తించ‌డంతో ఆయ‌న ఇచ్చిన వివ‌ర‌ణ‌కు సంతృప్తి చెందింది. దీంతో విప‌క్షాలు .. ఓ వ‌ర్గం మీడియా చేసిన దాడి బుట్టదాఖ‌లైంది.

ఇక టీడీపీ వాళ్లు కూడా ఏదో కావాల‌ని ఆయ‌న‌పై అవాకులు చెవాకులు పేలారు. టీడీపీ పెన్షన్ల విషయంలో తమ చేతికి మట్టి అంటకుండా నిమ్మగడ్డ రమేశ్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయించింది. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి వినియోగించకూడదని నిమ్మగడ్డ రమేశ్ వాదించారు. ఆ వాదనతో ఏకీభవించిన ఈసీ పెన్షన్ల పంపిణీని వాలంటీర్లు చేయవద్దని ఆదేశించింది. ఈ విషయంలో అత్యుత్సాహం చూపిన రాజ‌మండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి.. అవ్వాతాతలకు, దివ్యాంగులకు వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకున్నది తామేనని బహిరంగంగానే ప్రెస్ మీట్‌ పెట్టి మరీ చెప్పాడు. అంతే కాదు.. ఏకంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీపై వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా ఎన్ని వత్తిళ్లు వచ్చినా సీఎస్‌ జవహర్‌ రెడ్డి మాత్రం ముక్కుసూటిగా నిబంధనల మేరకే విధులు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: