గిల్.. నీకు ఇది అవసరమా.. చేతులారా కెరియర్ నాశనం?

praveen
టీమిండియా హిస్టరీలో ఎంతోమంది ప్లేయర్లు కెరియర్ తొలినాళ్లలో ఒక స్థానంలో ఆడి.. ఇక తర్వాత కాలంలో మరో స్థానానికి ప్రమోట్ అయిన వారు చాలామంది ఉన్నారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కెరియర్ తొలినాళ్లల్లో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే వాడు. కానీ అతడిలోని దూకుడును గమనించిన సీనియర్లు.. ఇక ఓపెనర్ గా కొత్త బంతిని ఎదుర్కొనే ఛాన్స్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం భారత కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ సైతం ఒకప్పుడు మిడిల్ ఆర్డర్ లో ఆడుతూ ఉండేవాడు. కానీ ఆ తర్వాత కాలంలో ఓపెనర్ గా అతనికి ప్రమోషన్ దక్కింది అని చెప్పాలి.


 ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సైతం ఒకప్పుడు ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ చేసే వాడు. కానీ ఆ తర్వాత టాప్ ఆర్డర్ కి ప్రమోషన్ పొంది ఇప్పుడు ప్రపంచంలోనే ప్రమాదకర బ్యాట్స్మెన్ గా మారిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మిడిల్ ఆర్డర్ లేదా లోయర్ ఆర్డర్ నుంచి ఓపెనర్ వచ్చిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆ కాలంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ హనుమ విహారిని ఓపెనర్ గా ఛాన్స్ ఇచ్చి బీసీసీఐ చేతులు కాల్చుకుంది. ఇక ఇప్పుడు ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది.


 అండర్ 19 ప్రపంచ కప్ లో అదరగొట్టి అదే ఊపులో భారత జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు శుభమన్ గిల్ ఇక భారత జట్టులోకి వచ్చిన తర్వాత కూడా చక్కటి ఇన్నింగ్స్ లతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అదే సమయంలో శిఖర్ దావన్, కేల్ రాహుల్ ఫామ్ కోల్పోవడం అతనికి బాగా కలిసి వచ్చింది. అయితే ఇప్పుడు వెస్టిండీస్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. అయితే యంగ్ ఓపెనర్ స్థానాన్ని త్యాగం చేసి మూడో ప్లేస్ కు చేరుకున్నాడు శుభమన్ గిల్ ని మూడవ స్థానం.. అతనికి అస్సలు అచ్చి రావట్లేదు. రెండు మ్యాచ్లలో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. తొలి టెస్ట్ లో ఆరు పరుగులకు వెనుదిరిగిన శుభమన్ గిల్.. రెండో టెస్టులో పది పరుగులు మాత్రమే చేశాడు.ఇలా తన స్థానాన్ని త్యాగం చేసి చివరికి గిల్ కెరియర్ నాశనం చేసుకుంటున్నాడు అంటూ అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: