నయా అల్కరాజ్.. గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయిందిగా?
టెన్నిస్ ప్రపంచంలో తిరుగులేని వీరుడుగా కొనసాగుతున్న జకోవిచ్ ను ఓడించి వింబుల్టన్ విజేతగా నిలిచాడు స్పెయిన్ యువకిరంటం కార్లోస్ అర్కరాజ్. ఈ క్రమంలోనే అతని పేరు ప్రస్తుతం టెన్నిస్ ప్రపంచంలో మారుమోగిపోతుంది. జకోవిచ్ తర్వాత టెన్నిస్ ప్రపంచాన్ని ఏలబోయే కొత్త ఛాంపియన్ ఇతనే అంటూ ఎంతో మంది ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఈ కొత్త ఛాంపియన్ కు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలుసుకునే పనిలో నేటిజన్స్ మునిగిపోయారు అని చెప్పాలి. అయితే సాధారణంగా ఈ యంగ్ ప్లేయర్ తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో పంచుకునేందుకు పెద్దగా ఇష్టపడడు.
కానీ ఈ నయా చాంపియన్ ఒక ముద్దుగుమ్మతో ప్రేమలో మునిగి తేలుతున్నాడు అన్న విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. మూర్సిన పట్టణానికి చెందిన కార్లోల్ అదే పట్టణానికి చెందిన మరియా గొంజాలెజ్ గివ్మేనేజ్ అనే అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడట. ఆమె కూడా ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ కావడం గమనార్హం. స్పెయిన్ లో పుట్టి పెరిగిన ఆమె ప్రస్తుతం ముర్సియా క్లబ్ టెన్నిస్ అనే క్లబ్ కోసం టెన్నిస్ ఆడుతుంది. ఇప్పటివరకు ఇద్దరు బంధాన్ని ఎక్కడ బహిరంగంగా వెల్లడించలేదు. కానీ గతంలో వీరిద్దరూ పెట్టిన పోస్టులు ఆధారంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ నేటిజెన్స్ ఫిక్స్ అయిపోయారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి.