అరంగేట్రంలోనే సెంచరీ.. జైస్వాల్ అరుదైన రికార్డ్?
సీనియర్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా విఫలమవుతూ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న వేళ పెద్దగా అనుభవం లేని ఈ యంగ్ బ్యాటర్ మాత్రం తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడు అని చెప్పాలి. దీంతో తన బ్యాటింగ్ శైలితో ఏకంగా సెలెక్టర్లను సైతం ఫిదా చేసేశాడు. ఇంకేముంది ఐపీఎల్ ముగిసిందో లేదో అంతలోనే వెస్టిండీస్ పర్యటన లో భాగంగా టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే ఇలా టీమిండియాలోకి వచ్చి పోయే ఆటగాళ్లు చాలామంది ఉంటారు అని యశస్వి జైష్వాల్ గురించి కూడా అందరూ అనుకున్నారు.
కానీ తాను వచ్చి పోయే ఆటగాడిని కాదు పాతుకుపోయే ఆటగాడిని అన్న విషయాన్ని మొదటి మ్యాచ్ తోనే నిరూపించాడు. మొదటి మ్యాచ్ లోనే సూపర్ సెంచరీ చేసి అదరగొట్టాడు యశస్వి జైష్వాల్. ఈ క్రమంలోనే ఎన్నో అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు. 215 బంతుల్లో 11 ఫోర్ ల సహాయంతో శతకం సాధించాడు. అయితే అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 17వ భారత బ్యాట్స్మెన్ గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. ఇక తక్కువ వయసులోనే సెంచరీ చేసిన నాలుగో బ్యాట్స్మెన్ గా నిలిచాడు. 21 సంవత్సరాల 196 రోజుల వయసులో సెంచరీ చేశాడు. ఇంతకంటే ముందు పృథ్విషా, అబ్బాస్, గుండప్ప విశ్వనాథ్ తక్కువ వయసులోనే సెంచరీలు చేసి తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.