సెంచరీలలో.. రోహిత్ రికార్డును బద్దలు కొట్టిన స్మిత్?
అయితే మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది అనే విషయం తెలిసిందే. ఇటీవల రెండో మ్యాచ్లో కూడా అదిరిపోయే ప్రదర్శన చేస్తుంది. కాగా ఇక ఇటీవల రెండో మ్యాచ్లో సెంచరీ తో చెలరేగి పోయిన స్మిత్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తన టెస్ట్ కెరియర్ లో ఏకంగా 32వ సెంచరీ నమోదు చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్గా 44వ శతకాన్ని నమోదు చేశాడు అని చెప్పాలి. సెంచరీ తో చెలరేగిపోయిన స్మిత్ మరో రికార్డ్ కూడా సృష్టించాడు. ఏకంగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టాడు స్మిత్.
ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక ఇంటర్నేషనల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నాలుగవ స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ 41 సెంచరీలతో ఉండగా సమిత్ 42 సెంచరీలు చేసాడు. ఇక దీంతోపాటు మరో రికార్డును కూడా స్మిత్ ఖాతాలో చేరిపోయింది అని చెప్పాలి. టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీల వీరుల జాబితాలో ఆస్ట్రేలియా తరఫున దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వా 32 సెంచరీలతో సంయుక్తంగా రెండవ స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతో టాప్ లో ఉండగా, జాక్ కలిస్ 45, రికీ పాంటింగ్ 41 సెంచరీలతో ఈ జాబితాలో ఉన్నారు అని చెప్పాలి. కాగా రెండో టెస్టులో ఆస్ట్రేలియా జోరు చూస్తే..రెండు మ్యాచ్ లలో కూడా విజయం సాధించేలాగే కనిపిస్తుంది.