విరాట్ తో ఆడితే ఆ మజానే వేరు.. ధోని నాయకత్వం సూపర్: ఏబీ డివిలియర్స్

praveen
వన్డే ప్రపంచ కప్ సందడి అప్పుడే షురూ అయింది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఐసీసీ కూడా షెడ్యూల్ ని అధికారికంగా ప్రకటించేసింది. దీంతో కీలక ఆటగాళ్లను ఉద్దేశించి మాజీ ఆటగాళ్లు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉన్నారు. సొంత గడ్డపై ఈసారి ప్రపంచకప్ జరగనుండటంతో టీమ్ ఇండియా మంచి జోష్ మీద వుంది. బ్యాటింగ్ ఆర్డర్లో వెన్నెముకగా నిలిచే విరాట్ కోహ్లి నుంచి అభిమానులు అద్భుత ప్రదర్శన ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ సహచరుడైన ఏబీ డివిలియర్స్ విరాట్ కోహ్లితోపాటు 'కెప్టెన్ కూల్' ఎంఎస్ ధోనీ గురించి రాబిన్ ఉతప్పతో మాట్లాడిన మాటలు ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఆ వీడియోను జియో సినిమా తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేయడం కొసమెరుపు. ఈ సందర్భంగా ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ... "విరాట్ కోహ్లితో కలిసి ఆడటం అనేది మర్చిపోలేని అనుభూతి. అతగాడు చాలా మంది యువకులకు స్ఫూర్తిగా నిలిచాడు. అతడు అత్యుత్తమ ఆటగాడని చెప్పడానికి ఎంతమాత్రం సంకోచించను. ఇక కెప్టెన్ కూల్ ఈ ఐపీఎల్ సీజన్లో జట్టును ఎలా నడిపించాడో అందరికీ తెలిసిన విషయమే. చివర్లో బ్యాటింగ్ కి దిగినా ఆ క్రేజ్ మాత్రం తగ్గలేదు. నిస్వార్ధంగా జట్టు కోసం కష్టపడే ఏకైక క్రికెటర్ ధోని. విరాట్, ధోనీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఎవరి ప్రదర్శనను తక్కువగా చేసి మాట్లాడడం కష్టం!" అని తెలిపాడు.

ఇకపోతే, 2011 తర్వాత జరిగిన 2 వన్డే ప్రపంచకప్ ల్లోనూ భారత్ సెమీస్ వరకు చేరినప్పటికీ ఓటమి పాలైంది. ఈసారి రోహిత్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న టీమ్ండియా విజేతగా నిలిచేందుకు వున్న అన్ని అవకాశాలను పుష్కలంగా వాడుకోవాలని చూస్తోంది. ధోనీ సారథ్యంలోనే భారత్ కి చివరి ఐసీసీ టైటిల్ (ఛాంపియన్స్ ట్రోఫీ 2013) దక్కిందనే విషయం అందరికీ విదితమే. ఇక పదేళ్ల నిరీక్షణకు తెరదించాలంటే అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19వ తేదీ వరకు జరిగే వన్డే ప్రపంచకప్ భారత్ ఖచ్చితంగా గెలిచి తీరాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: