ఆరోజు.. నేను జడేజాను తిట్టలేదు : సీఎస్కే సీఈవో

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్ టీం గా కొనసాగుతుంది. ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ టైటిల్స్ గెలిచిన టీం గా ముంబై ఇండియన్స్ తో సమానంగా ఉంది అని చెప్పాలి. అయితే 2023 ఐపీఎల్ సీజన్ లో మహేంద్ర సింగ్ ధోని మరోసారి తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేసి ఇక జట్టును ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిపాడు. అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో మొదట్లో చెన్నై సూపర్ కింగ్స్ కాస్త తడబడినట్లు కనిపించినప్పటికీ.. తర్వాత మాత్రం అద్భుతంగా పుంజుకుని చివరికి ఛాంపియన్గా నిలిచింది.



 అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఎప్పటిలాగానే మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ టీం లో విభేదాలు ఉన్నాయి అంటూ మధ్యలో కొంత ప్రచారం కూడా జరిగింది. ధోని, జడేజా ఒక మ్యాచ్ సమయం లో సీరియస్ గా మాట్లాడుకోవడంతో.. ఏదో విషయంలో ధోని, జడేజా కు వార్నింగ్ ఇచ్చాడు అంటూ ప్రచారం జరిగింది. ఇక తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి సీఈవోగా ఉన్న కాశీ విశ్వనాథ్ వచ్చి సీరియస్గా జడేజాతో మాట్లాడాడు. దీంతో ఇక కాశీ విశ్వనాథ్ అటు జడేజాను ఏదో తిట్టాడు అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు.


 ఇటీవల ఇదే విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ అసలు విషయంపై క్లారిటీ ఇచ్చాడు. అయితే జడేజా ధోని మధ్య సీరియస్ డిస్కషన్ జరిగిన సమయంలో నేను జడేజాను తిట్టాను అని అందరూ అనుకున్నారు. ఈ వీడియో చూసి అందరూ అలాగే భావించారు. కానీ అలాంటిదేమీ లేదు. ఆ మ్యాచ్ గురించి అతను ఆడిన విధానం గురించి అప్పుడు నేను జడేజాతో మాట్లాడాను అంటూ కాశి విశ్వనాథ్ క్లారిటీ ఇచ్చారు. కాగా ఫైనల్ మ్యాచ్ లో జడేజా విన్నింగ్ షాట్ కొట్టి ఇక టైటిల్ గెలిపించాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: