ఐపీఎల్ డబ్బు పోయినందుకు.. బాధపడట్లేదు : ఆసిస్ ప్లేయర్

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అటు ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపును సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ లీగ్ గా కూడా కొనసాగుతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇక ఈ లీగ్ లో పాల్గొంటే ఒకవైపు కోట్ల రూపాయల ఆదాయంతో పాటు మరోవైపు స్టార్ ప్లేయర్లతో డ్రసింగ్ రూమ్ పంచుకునే అనుభవం కూడా దక్కుతుంది. ఇంకోవైపు ఇక మంచి ప్రదర్శన చేస్తే ప్రపంచ క్రికెట్లో ఆ ప్లేయర్ కి ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఇక విదేశీ క్రికెటర్లు సైతం ఐపీఎల్ లో ఆడటానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.


 ఇలా ఇప్పటివరకు ఎంతోమంది విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ లో భాగం అయ్యి తమ ఆట తీరుతో ఇక భారత్లో సైతం ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వారు ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా ఎక్కువ మంది క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడటానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటే కొంతమంది మాత్రం ఇక ఐపీఎల్ టోర్నీ విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. ఇలా ఐపిఎల్ లో ఆడటాన్ని వ్యతిరేకించే వారిలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్ కు కూడా ఒకరు అని చెప్పాలి. ఐపిఎల్ లో వచ్చిన డబ్బు కంటే తనకు తన జట్టు తరఫున 100 టెస్టులు ఆడటమే గొప్ప విషయం అంటూ గతంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు మిచెల్ స్టార్క్.


 ఇకపోతే ఇటీవలే మరోసారి ఐపీఎల్ ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. టెస్ట్ క్రికెట్లో ఆడే అవకాశం రావడానికి ఎంతో గొప్పగా భావిస్తున్నాను అంటూ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్  చెప్పుకొచ్చాడు. వందేళ్ళకు పైగా చరిత్ర కలిగిన టెస్టు క్రికెట్ ను ఆస్ట్రేలియా నుంచి 500 కంటే తక్కువ మంది ఆడారు. అందుకే టెస్ట్ ఫార్మాట్ నాకు ఎంతో స్పెషల్ అంటూ మిచెల్ స్టార్క్ చెప్పుకొచ్చాడు. డబ్బు ఈరోజు వస్తుంది రేపు పోతుంది. అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకోవడం ద్వారా తాను కోల్పోయిన డబ్బు గురించి ఎప్పుడు బాధపడటం లేదు అంటూ మిచెల్ స్టార్క్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: