పాక్ బ్యాటర్లను చూసి.. టీమిండియా చాలా నేర్చుకోవాలి?
ఒక రకంగా చెప్పాలంటే ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఫేసర్ల దాటిని తట్టుకోలేకపోయారు టీమిండియా బ్యాట్స్మెన్లు. చెత్త షాట్స్ ఆడి చివరికి చేజేతులారా వికెట్ సమర్పించుకున్నారు అని చెప్పాలి. మ్యాచ్ ముగిసినప్పటికీ ఇక టీమిండియా బ్యాట్స్మెన్ ల ప్రదర్శన పై మాత్రం విమర్శలు ఆగడం లేదు. ఇక ఇటీవల ఇదే విషయం గురించి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు అని చెప్పాలి. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో అటు టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది అంటూ చెప్పుకొచ్చాడు.
మరీ ముఖ్యంగా ఇక టీమిండియా బ్యాట్స్మెన్ల ప్రదర్శన అయితే దారుణంగా ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. అయితే నేను చెప్పిన మాటతో నాకు తెలిసి టీమిండియా బ్యాట్స్మెన్ల ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేయొచ్చు.. భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు స్వింగ్ బంతులను ఎలా ఆడాలో పాకిస్తాన్ బ్యాట్స్మెన్లని చూసి నేర్చుకోవాలి. ఇక ఇలాంటి బంతులను అటు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా బాగా ఆడుతారు. వీరు ఫాస్ట్ బౌలింగ్లో బంతులను చూసి మెల్లగా ఆడుతారు అంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ చెప్పుకొచ్చాడు. అయితే డబ్ల్యూటీసి ఫైనల్ ఓటమి నేపథ్యంలో ఇక టీమిండియా ప్రక్షాళన చేసేందుకు సెలెక్టర్లు కూడా నిర్ణయించారు అని తెలుస్తుంది.