ఒక్క సిక్స్ తో.. సచిన్ రికార్డు బ్రేక్ చేసిన రోహిత్?

praveen
ప్రస్తుతం టీమిండియాలో అత్యుత్తమ క్రికెటర్ల జాబితాను తీస్తే ముందుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేరు వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇక టీమిండియాలో సీనియర్ ప్లేయర్లుగా కూడా ఈ ఇద్దరే కొనసాగుతున్నారు. దాదాపు గత దశాబ్ద కాలం నుంచి  టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శనతో జట్టును గెలిపిస్తూ వస్తున్నారు ఈ ఇద్దరు క్రికెటర్లు. అయితే అటు విరాట్ కోహ్లీకి రికార్డుల రారాజుగా పేరు ఉంటే అటు రోహిత్ శర్మ కి డబుల్ సెంచరీల వీరుడిగా సిక్సర్ల దీరుడుగా పేరు ఉంది అన్న విషయం తెలిసిందే.


 రోహిత్ శర్మ ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడు అంటే చాలు ఇక సిక్సర్ల సునామీ సృష్టిస్తూ ఉంటాడు. అతను భారీగా పరుగులు చేశాడు అంటే అందులో సిక్సర్ల ద్వారా వచ్చిన పరుగులే ఎక్కువగా ఉంటాయి అనడంలో సందేహం లేదు. అందుకే అభిమానులు అందరూ కూడా అతన్ని సిక్సర్ల  వీరుడు అని పిలుచుకోవడం చేస్తూ ఉంటారు. అయితే సిక్సర్లు కొట్టడం విషయంలో ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు కూడా కొల్లగొట్టాడు రోహిత్ శర్మ. మొదటి ఇన్నింగ్స్ లో నిరాశ పరిచినప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 60 బంతుల్లో 43 పరుగులు చేసి పరవాలేదు అనిపించాడు.


 కాగా రోహిత్ శర్మ ఇన్నింగ్స్ లో ఏడు ఫోర్ లతో పాటు ఒక సిక్సర్  కూడా ఉండడం గమనార్హం. అయితే ఈ ఒక్క సిక్సర్ ద్వారా రోహిత్ శర్మ అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక  సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్మెన్లు జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్లో 70 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ 90 సిక్సర్లతో తొలి స్థానంలో ఉండగా.. తర్వాత స్థానంలో మహేంద్ర సింగ్ ధోని 78 సిక్సర్లతో ఉన్నాడు. ఇక రోహిత్ తర్వాత సచిన్ 69 సిక్సర్లతో  ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: